వక్షోజాలను పట్టుకోవడం నేరం కాదు - హైకోర్టు సంచలనం
అలహాబాద్ హైకోర్టు ఇటీవలే ఒక కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామా తాడును తెంపడాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని న్యాయమూర్తి రామ్ మనోహర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ చర్యలు తీవ్రమైన లైంగిక దాడి కిందకు వస్తాయని, ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని న్యాయమూర్తి అన్నారు.ఒక 11 సంవత్సరాల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె వక్షోజాలు పట్టుకుని కల్వర్టు కిందకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే ఆమె ప్యాంటు నాడాలు కట్ చేసి ప్యాంటు విప్పబోయారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు పెట్టగా, న్యాయస్థానం ఈ కేసు అత్యాచారయత్నం కిందకు రాదని వెల్లడించింది.

అయితే, నిందితులపై అత్యాచారం అభియోగాలను తీసేసి వస్త్రాలను తొలగించే ఉద్దేశంతో నేరపూరిత బలప్రయోగానికి పాల్పడ్డట్లుగా మార్చారు.నిందితులు అత్యాచారం చేయాలనే ఉద్దేశంతోనే బాలికపై దారుణానికి పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు రికార్డులో లేవని న్యాయమూర్తి మిశ్రా వెల్లడించారు.బాధితురాలి ప్యాంటు నాడాలు కట్ చేసి, ఆమెను కల్వర్టు కిందకు లాగేందుకు ప్రయత్నించారని చెప్పారే తప్ప, ఎక్కడ కూడా బాలిక నగ్నంగా మారిందని, ఆమెపై వారు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని చెప్పలేదని అన్నారు.దీన్ని బట్టి వీరిద్దరిపై అత్యాచారయత్నం కేసు కాకుండా సెక్షన్ 354(బీ)ఏపీసీ చిన్న అభియోగం కింద సమన్లు1 జారీ చేయబడతాయన్నారు. అంటే ఒక మహిళపై దుస్తులు తీసేసి ఆమెను నగ్నంగా మార్చాలనే ఉద్దేశంతో దాడి చేయడం కిందకు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications