viral video:గ్రేట్ ఖలీ గొడవ, టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణ.. వైరల్
మాజీ రెజ్లర్ దలీప్ సింగ్ రానా అలియాస్ గ్రేట్ ఖలీ టోల్ ప్లాజా సిబ్బందితో గొడవకు దిగాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. అయితే అందులో ఖలీ దాడి చేసిన విజువల్ మాత్రం కనిపించలేదు. లుధియానాలో ఓ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది ఒకరు సెల్పీ కోసం వచ్చాడు. అయితే తాను సెల్పీ ఇవ్వనని చెప్పినా.. గొడవ జరిగింది. తనను ఎందుకు కొట్టావు అని ఆ సిబ్బంది అడిగినా మాటలు వీడియోలో వినిపించాయి.

ఖలీ గొడవ..
పంజాబ్ జలంధర్ ప్రాంతంలోని ఫిలౌర్ వద్ద టోల్ బూత్ సిబ్బంది ఖలీని ఆపారు. ఆయనను చూసిన ఓ ఉద్యోగి ఆయన కారులోకి దూసుకెళ్ళాడట. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఖలీ ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్తున్నారు. వీడియోలో వీరిద్దరి ఘర్షణలో ఓ పోలీసు కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తనను ఎందుకు కొట్టావు అని గ్రేట్ ఖలీని ఆ ఉద్యోగి పదే పదే అడుగినట్టు కనిపిస్తోంది.

టోల్ సిబ్బంది..
ఆ తర్వాత గ్రేట్ ఖలీ తన కారు నుంచి బయటకు వచ్చి, పోలీసు కానిస్టేబుల్‌తో.. ఆ ఉద్యోగితో మాట్లాడారు. పంజాబ్ ఫిలౌర్‌లో ఉన్న టోల్ బూత్ ఉద్యోగి తన కారును ఆపి, సెల్ఫీ కోసం తనతో తప్పుగా ప్రవర్తించారు. తనను సెల్ఫీని తిరస్కరించడంతో దురుసుగా ప్రవర్తించారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని, దూషించారని పేర్కొన్నారు.

జాతి వివక్ష ఆరోపణలు
పంజాబ్‌లో గల జలంధర్ నుంచి ఖలీ.. హర్యానాలో గల కర్నాల్ వెళుతున్నారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరువర్గాల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే మీ ఐడీ కార్డు అడిగితే తన కొలిగ్‌ను కొట్టారని టోల్ ప్లాజా సిబ్బంది పేర్కొన్నారు. కానీ అతను బ్లాక్ మెయిల్ చేశాడని ఖలీ చెబుతున్నాడు. అంతేకాదు తనను జాతి వివక్ష ఆరోపణలు చేశాడని చెబుతున్నారు. గొడవకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది.
సెలబ్రిటీ
ఖలీ నుంచి సెల్ఫీ తీసుకోవడం సహజమే.. అంతా అడుగుతారు. కానీ ఇలా ఏదో కారణం చెప్పి ఇవ్వకపోవడం తప్పు.. పైగా గొడవకు దిగడం మరీ దారుణం.. వారు సెలబ్రిటీలు అయినందునే సెల్పీ అడుగుతారు. కానీ దానిని ఇలా తిరస్కరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.












Click it and Unblock the Notifications