గర్ల్ ఫ్రెండ్ కాజల్ కు వందల కోట్ల ఆస్తులు ఇచ్చిన డాన్, స్కామ్ లో కిలాడీకి ఇన్ని వందల కోట్లు !

మెటల్ గుజూరీ మాఫియాకు సంబంధించి నోయిడా పోలీసులు ఇప్పటివరకు రూ 200 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని, ఇవన్నీ స్కామ్ మెటల్ మాఫియా గ్యాంగ్ స్టార్ రవి కనా అలియాస్ రవికి చెందినవని పోలీసులు అధికారులు తెలిపారు. రవి మాఫియా ముఠా జాతీయ రాజధాని డిల్లీ ప్రాంతంలో మెటల్ మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

గుజురీ మెటల్ మాఫియాపై నోయిడా పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఇప్పుడు దక్షిణ ఢిల్లీలో మాఫియా కింగ్‌పిన్ రవి గర్ల్ ఫ్రెండ్ కాజల్ ఝా అలియాస్ కాజల్ కు చెందిన రూ. 100 కోట్ల విలువైన బంగ్లాను, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మెటల్ మాఫియా డాన్ రవి గర్ల్ ఫ్రెండ్ కు చెందిన ఆస్తుల వివరాలు తెలుసుకున్న పోలీసు అధికారులు హడలిపోయారు.

Greater Noida Police seizes property worth Rs 100 crore in the name of Kajal, girlfriend of metal scrap trader Ravi.

ప్రస్తుతం మాఫియా గ్యాంగ్ స్టార్ రవి కనా గర్ల్ ఫ్రెండ్ కాజల్ ఝా గతంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో రవి కనాతో పరిచయం ఏర్పడింది. ఆ విధంగా రవి గ్యాంగ్‌లో కాజల్ చేరింది. కొద్దికాలంలోనే రవి ముఠాలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా కాజల్ గుర్తింపు పొందిందని పోలీసు అధికారులు అంటున్నారు. తరువాత, రవి కాన దక్షిణ ఢిల్లీలోని మూడు అంతస్తుల బంగ్లాను కాజల్ ఝూకు బహుమతిగా ఇచ్చాడు. బుధవారం దాడికి ముందు పోలీసుల నుండి తప్పించుకోవడానికి కాజల్ ఝా, ఆమె సహచరులు పారిపోయారు.

రవి గర్ల్ ఫ్రెండ్ కాజల్ ఝూకు చెందిన లగ్జరీ బంగ్లా విలువ రూ. 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పోలీసులు కాజల్ కు చెందిన ఈ బంగ్లాను సీజ్ చేశారు.రవీంద్రనగర్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రవి కాన 16 మంది సభ్యులతో మెటల్ మాఫియా ముఠాను నడుపుతున్నాడు. ఈ ముఠా రీబార్, స్క్రాప్ మెటీరియల్‌లను అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ టీమ్‌ని మేనేజ్ చేసిన రవి స్క్రాప్ డీలర్. అయితే ఢిల్లీత్ పాటే దేశ రాజధానిలో ఈ గుజరి వస్తువులను కొనడానికి మరియు విక్రయించడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేసి కోటీశ్వరుడు అయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ రవి కాన గ్రేటర్ నోయిడాలో అప్పటికే గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న హరేంద్ర ప్రధాన్ సోదరుడు. 2014లో, ఈ హరేంద్ర నాథ్‌ను 2014లో ప్రత్యర్థి ముఠా హత్య చేసింది.

Greater Noida Police seizes property worth Rs 100 crore in the name of Kajal, girlfriend of metal scrap trader Ravi.

దీని తర్వాత రవి కాన అతని సోదరుడు హరేంద్ర వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా హత్య బెదిరింపుల నేపథ్యంలో రవి కాన పోలీసుల నుంచి రక్షణ పొందాడు. కొద్దిరోజుల క్రితం భారీ పోలీసుల భద్రతతో మెటల్ మాఫియా డాన్ రవి ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే మెటల్ మాఫియా డాన్ రవి మీద 11 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో కిడ్నాప్, చోరీలు, లూటీల కేసులు ఉన్నాయి.

రవి ముఠాలోని ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు గ్రేటర్ నోయిడా పోలీసు అధికారి సాద్ మియా ఖాన్ మీడియాకు తెలిపారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అనేక ప్రాంతాల్లో రవికి గుజురీ వస్తువుల గోదాములు ఉన్నాయి, అక్కడ పోలీసులు దాడులు చేశారు. ప్రస్తుతం రవి అతని గర్ల్ ఫ్రెండ్, అతని ముఠాలోని ఇతర సభ్యులతో కలిసి పరారీలో ఉన్నాడు. రవి, అతని గర్ల్ ఫ్రెండ్ కాజల్ ఝూతో పాటు అతని ముఠాలోని సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+