వందేభారత్ ఎక్స్ప్రెస్: ఖజురహో అందాల విందు అక్కడ నుండి 5గంటల్లోనే!
పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. వారణాసి, వింధ్యాచల్, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్ మరియు ఖజురహో లను సందర్శించేలా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను అనుసంధానించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారణాసి నుండి ఖజురహో వరకు కేవలం 5 గంటల్లోనే ప్రయాణించడానికి అద్భుతమైన అవకాశం లభించింది.
ప్రయాగ్ రాజ్ ఛోకీ స్టేషన్ లో స్టాప్
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రెండు చారిత్రాత్మక నగరాల మధ్య ఐదవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించింది. అయితే ఈ రైలుకు ప్రయాగ్ రాజ్ లో స్టాప్ లేదు. కానీ తాజా నిర్ణయంతో ప్రయాగ్ రాజ్ లోని ఛోకీకి కూడా స్టాప్ ను కేటాయించారు. దీంతో ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ కు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

గతంలో రైలు రవాణాకు ఇబ్బంది
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు వైపులా ప్రయాణం చేసే క్రమంలో ఛోకీ స్టేషన్లో ఆగుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతుంది. ముఖ్యంగా వారణాసి, వింధ్యాచల్, ప్రయాగ్ రాజ్ మరియు చిత్రకూట్ లను కలుపుతూ సాగుతుంది. అయితే ఈ పుణ్యక్షేత్రాలను పర్యటించాలి అనుకునేవారు గతంలో వాహనాలలో లేదా బస్సులలో ప్రయాణం చేసి గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వచ్చేది.
శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి
రైలు రవాణా సరిగ్గా లేకపోవడంతో సమయం వృధా అయ్యేది. ఖజురహో ఎంపీ విష్ణు దత్త శర్మ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాగ్ రాజ్ లోని ఛోకీ స్టేషన్లో రైలును ఆపడానికి అధికారికంగా ఆమోదించి ఇదే విషయాన్ని ఆయనకు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
పవిత్ర స్థలాలను కలిపేలా వందే భారత్
యునెస్కో వారసత్వ సంపద అయిన ఖజురహో దేవాలయాలను, వారణాసిలోని గంగా ఘాట్ లను, ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమాన్ని, శృంగవేర్ పూర్ ధామ్ మరియు చిత్రకూట్ లోని రామాయణంతో సంబంధం ఉన్న పవిత్ర స్థలాలను ఒకే ప్రయాణంలో చేరుకునేలా వందే భారత్ అవకాశం కల్పిస్తుంది.
రైలు తాత్కాలిక టైమ్ టేబుల్ విడుదల
ఈ మేరకు రైలు తాత్కాలిక టైం టేబుల్ ను కూడా విడుదల చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఉదయం 5 గంటల 25 నిమిషాలకు వారణాసి నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.10నిమిషాలకు ఖజురహో చేరుకుంటుంది. మధ్యలో వింధ్యాచల్, ప్రయాగ్ రాజ్ ఛోకీ, చిత్రకూట్ ధామ్, బండా మరియు మహోబా మీదుగా ప్రయాణం చేస్తుంది.












Click it and Unblock the Notifications