నటి శ్రీదేవి వాచ్‌మెన్ అరెస్ట్: వీడియోలతో బెదిరింపులు, ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Sridevi’s Security Guard Arrested

  చెన్నై: తనను ప్రేమించి మరోకరితో వివాహం చేసుకొనేందుకు సిద్దమైందనే కారణంగా నటి శ్రీదేవి సమీప బంధువును బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

  తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో సినీ నటి శ్రీదేవి ఇంటి వాచ్‌మెన్‌గా రాహుల్‌కుమార్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే రాహుల్‌కుమార్ నటి శ్రీదేవి సమీప బంధువును ప్రేమించాడు.

  ఈ ఇంట్లో ఉన్న సమయంలో ఏర్పడిన పరిచయం ఆసరాగా శ్రీదేవి బంధువుతో ప్రేమాయణం సాగించాడు. రాహుల్ కుమార్ బీహర్ వాసి. వీరిద్దరి మధ్య ప్రేమ సాగిన సమయంలో ఫోటోలు తీసుకొన్నారు.ప్రస్తుతం ఆ యువతికి వేరొకరితో వివాహం నిశ్చయమైంది.

  ఫోటోలు బయటపెడతానని బెదిరింపులు

  ఫోటోలు బయటపెడతానని బెదిరింపులు

  నటి శ్రీదేవి ఇంట్లో బీహర్‌కు చెందిన రాహుల్‌కుమార్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు.ఆ సమయంలో ఆ ఇంట్లోనే ఉండే శ్రీదేవి సమీప బంధువుతో రాహుల్‌కుమార్ ప్రేమాయణం సాగించారు ఆ యువతి శ్రీదేవి ఇంట్లోనే ఉండి చదువుకొంటుంది.వీరిద్దరి మధ్య ప్రేమాయాణం సాగుతున్న సమయంలో ఫోటోలు తీసుకొన్నారు. అయితే ఫోటోలు తీసిన విషయం ఆ యువతికి మాత్రం తెలియదు.

  బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన రాహుల్

  బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన రాహుల్

  నటి శ్రీదేవి బంధువు కూతురుకు వేరే యువకుడితో వివాహన్ని నిశ్చయించారు.ఈ విషయం తెలిసిన రాహుల్‌కుమార్ ఆ యువతిని వేధింపులకు గురిచేశారు. తన వద్ద ఉన్న ఫోటోలను బయటపెడతానని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

  నిశ్చితార్థం జరిగాక ట్విస్టిచ్చిన రాహుల్

  నిశ్చితార్థం జరిగాక ట్విస్టిచ్చిన రాహుల్

  నటి శ్రీదేవి బంధువు కూతురుకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని గుర్తించిన రాహుల్‌ తన వద్ద ఉన్న ఫోటోలను, వీడియోలను బాధిత యువతికి చూపి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.ఈ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడంతో కుటుంబసభ్యులకు చెప్పింది బాధిత యువతి.

  పోలీసులకు ఫిర్యాదు

  పోలీసులకు ఫిర్యాదు

  ఈ విషయం తెలుసుకొన్న యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు రాహుల్‌కుమార్ ను అరెస్ట్ చేశారు.కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Police arrested a man working as a security guard at actor Sridevi’s residence in Alwarpet for threatening to upload a video of his niece online. Police said Rahul Kumar Dhanthi, 28, of Bihar, was arrested based on a complaint by the mother of his niece Meena who had visited the city recently.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి