Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం: ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు హాజరు

గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడవసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 156 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

Gujarat:Bhupendra Patel swearing in ceromony live updates in telugu: PM Modi to grace the occasion

ఇక సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు ఇతర కేంద్రమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఇక బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ కార్యక్రమం మినిట్-టూ-మినిట్ లైవ్ మీకోసం

Dec 12, 2022, 3:05 pm IST

గుజరాత్ 18వ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌‌ను ఆయన క్యాబినెట్ మంత్రులను ప్రధాని మోదీ అభినందించారు.బీజేపీకి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Dec 12, 2022, 2:50 pm IST

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ దేవవ్రత్ ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Dec 12, 2022, 2:32 pm IST

గుజరాత్ కేబినెట్‌లో బీజేపీ నేతలు నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Dec 12, 2022, 2:23 pm IST

గుజరాత్ కేబినెట్‌లో బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Dec 12, 2022, 2:14 pm IST

గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న భూపేంద్ర పటేల్.
Dec 12, 2022, 2:13 pm IST

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో ఆయన కుటుంబసభ్యులు గాంధీనగర్‌లోని వేదికవద్దకు చేరుకున్నారు.
Dec 12, 2022, 2:10 pm IST

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎంపీ సీఎం ఎస్‌ఎస్ చౌహాన్, కర్ణాటక సీఎం బి బొమ్మై, అస్సాం సీఎం హెచ్‌బీ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పీఎస్ ధామి, త్రిపుర సీఎం మాణిక్ సాహా గాంధీనగర్‌లో జరిగిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Dec 12, 2022, 2:08 pm IST

గాంధీనగర్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
Dec 12, 2022, 2:06 pm IST

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు.
Dec 12, 2022, 2:03 pm IST

మరికాసేపట్లో భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
Dec 12, 2022, 12:00 pm IST

కేబినెట్ మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం
Dec 12, 2022, 11:59 am IST

గుజరాత్‌లో ఏడవసారి అధికారం చేపట్టనున్న బీజేపీ
Dec 12, 2022, 11:59 am IST

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Dec 12, 2022, 11:57 am IST

. డిసెంబర్ 12వ తేదీన భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు
. డిసెంబర్ 12వ తేదీన భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+