అసహజ శృంగారం.. మత్తుమందు ఇచ్చి మరీ.. ఇటు అత్త మామ వేధింపులు, చివరికీ వివాహిత...

వారిద్దరికీ రెండో పెళ్లే.. ఒకరికొకరు మ్యాట్రిమోనియల్ సైట్‌లో చూసుకొని.. ఓకే అనుకున్నారు. గతేడాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. భర్త సెక్సువల్‌గా వేధిస్తే.. అత్త, మాట సూటిపోటి మాటలతో మరీ హరాస్ చేశారు. గుజరాత్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది.

 డాక్టరే కానీ..

డాక్టరే కానీ..

అహ్మదాబాద్‌లోని ఘట్లోడియాకు చెందిన ఆర్ధోపెడిక్ డాక్టర్ హితేంద్ర పటేల్, హర్షను గతేడాది ఆగస్టులో వివాహాం చేసుకున్నాడు. వీరు ఓధవ్ లోని మంగ్లం సొసైటీలో ఉండేవారు. అయితే అత్త, మామలు మాత్రం కట్నం కోసం వేధించేవారు. ఇంట్లో ఉండగా అత్తమామలు అదనపు కట్నంకోసం హింసుస్తున్నారని.. భూయాంగ్ దేవ్‌లో క్లినిక్ నడుపుతున్ భర్త వద్దకు వెళ్ళింది. భర్త ఆమెను హింసించారని సూసైడ్ నోట్‌లో తెలిపింది. సపోర్టుగా మాట్లాడకపోగా హింసించాడని ఆమె చెప్పారు. చిన్న విషయానికి దాడి చేసి పలు ఇబ్బందులకు గురి చేసేవాడని ఆమె వివరించింది.

రాత్రయితే చాలు..

రాత్రయితే చాలు..

వీటిని భరించినా.. ప్రతి రోజు రాత్రి నరకం చూపెవాడని వాపోయింది ఆ మహిళ. హితేంద్ర డాక్టర్ అయినందు వల్ల రోజు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాడని తెలిపింది. బలవంతంగా తనతో సెక్స్ చేసేవాడని, మత్తు ఇంజక్షన్ ప్రభావంలో స్పృహ కోల్పోయేదానినని వివరించారు. ఆ సమయంలో తనపై అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని సూసైడ్ నోట్‌లో తెలిపింది.

పుట్టింటికి వెళ్లి..

పుట్టింటికి వెళ్లి..

హితేంద్ర పటేల్ అసహజ లైంగిక చర్యలు తట్టుకోలేని హర్ష పటేల్ గతేడాది డిసెంబర్ లో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండు కుటుంబాలమధ్య సంప్రదింపుల అనంతరం ఇటీవల ఫిబ్రవరి 9న తిరిగి అత్తారింటికి వెళ్లిందని హర్ష పటేల్ తండ్రి నాన్జీ పటేల్ చెప్పారు. వెళ్లిన రోజే భర్త, అత్తమామల ప్రవర్తనతో తన కుమార్తె ఈ చర్యకు పాల్పడిందని ఆయన బాధతో చెప్పారు.

Recommended Video

    #TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections
    18 పేజీల సూసైడ్ నోట్

    18 పేజీల సూసైడ్ నోట్

    హర్ష ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె గదిని పరిశీలించారు. 18 పేజీల సూసైడ్ నోట్ కనిపించింది. భర్త, అత్తమామల నుంచి ఎదుర్కొన్న గృహ హింస, అదనపు కట్నం కోసం జరుగుతున్న వేధింపులు, భర్త మత్తు ఇంజక్షన్లు చేసి తనపై చేసే అసహజ శృంగార చేష్టలను రాసింది. మృతదేహాన్ని పోలీసులు సోలా అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందారని ప్రకటించారు. హర్ష తండ్రి ఫిర్యాదు మేరకు హితేంద్ర అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+