లైవ్ డెత్: తుపాకీతో స్టంట్, ఛాతీ చీల్చుకుంటూ వెళ్లిన బుల్లెట్!

నేటి కాలంలో సోషల్ మీడియాలో 'లైకులు', 'వ్యూస్' వస్తే చాలు.. ప్రాణాలనైనా పణంగా పెట్టేస్తున్నారు కొందరు యువకులు. ఆ పిచ్చి కాస్తా ముదిరి చివరకు చితి వరకు చేరుస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక భీభత్సమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తుపాకీతో రీల్ చేస్తూ, స్టైల్ కోసం ట్రిగ్గర్ నొక్కిన ఒక యువకుడు తన నిండు ప్రాణాన్ని కెమెరా సాక్షిగానే బలి తీసుకున్నాడు.

తూర్పు ఢిల్లీకి చెందిన పవన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఒక ప్లాన్ వేశాడు. స్నేహితుడి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని తీసుకొని, రొమ్ముకు గురిపెట్టుకొని స్టైలిష్‌గా వీడియో తీయాలనుకున్నాడు. స్నేహితుడు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు. గన్ ఎలా లోడ్ చేయాలో, బటన్ ఎలా నొక్కాలో ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తుపాకీని ఛాతీకి ఆనించి, వింత వింత ఫోజులిస్తూ కెమెరా వైపు చూసి పవన్ నవ్వుతూ కనిపించాడు.

Gun Stunt Gone Wrong East Delhi Youth Pawan Killed During Social Media Reel Recording Viral Video

'కాల్చొద్దు అన్నా' అని అరుస్తున్నా వినకుండా..

వీడియో రికార్డ్ చేస్తున్న మిత్రుడు ప్రమాదాన్ని పసిగట్టి "కాల్చొద్దు అన్నా.." అని హెచ్చరిస్తున్నా, పవన్ అత్యుత్సాహంలో కంగారు పడ్డాడు. చేతి వేలు తెలియకుండానే ట్రిగ్గర్ మీదకు వెళ్ళింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం.. ఆ మరుక్షణమే బుల్లెట్ గుండెల్లోకి దూసుకెళ్లింది. అంతసేపు నవ్వుతూ ఫోజులిచ్చిన పవన్.. రక్తం మడుగులో కెమెరా ముందే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి ఫైర్ అవ్వడంతో పవన్ అక్కడిక్కడే తుదిశ్వాస విడిచాడు.

స్నేహితుడిదే ఆ తుపాకీ!

ఈ దారుణానికి కారణమైన తుపాకీ పవన్ స్నేహితుడిదని, దానికి లైసెన్స్ కూడా ఉందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే, ప్రాణాంతకమైన ఆయుధంతో ఆడుకుంటూ వీడియో తీయడం విచారకరమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, వీడియో తీసిన స్నేహితుడిని విచారిస్తున్నారు.

వ్యూస్ కోసం ప్రాణాలు ఇస్తారా?

రీల్స్ కోసం ప్రమాదకరమైన సాహసాలు చేయడం ఇప్పుడు ఒక వ్యాధిలా మారుతోంది. కేవలం కొన్ని గంటల పాటు వచ్చే ఆన్‌లైన్ ప్రశంసల కోసం, కన్నవారికి కడుపుకోత మిగల్చడం ఎంతవరకు సమంజసం? ఈ ఘటన ప్రతి యువకుడికి ఒక హెచ్చరిక. ప్రాణం పోయాక ఏ రీల్ కూడా దాన్ని తిరిగి తీసుకురాలేదని గుర్తించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+