Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లికి రూ.200 కోట్లు .. చెత్త తొలగించేందుకు ఎంతో తెలుసా ..?

ఔలీ : యూపీలోని ఔలిలో గుప్తా కుటుంబ వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ చెత్త తొలగించేందుకు పారిశుద్య కార్మికులు పాట్లు పడుతున్నారు. ఇంతవరకు ఓకే .. కానీ గుప్తా ఫ్యామిలీ నిర్వాకం ఒకటి బయటపడింది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఔలీ కొండలో నిర్వహించారు. వందల కోట్లు గుమ్మరించారు. కానీ చెత్త తొలగించేందుకు మాత్రం పిసరంత డిపాజిట్ చేయడం కలకలం రేపుతోంది.

పేరుకుపోయిన చెత్త ..

పేరుకుపోయిన చెత్త ..

గుప్తా ఫ్యామిలీ వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ఆ కొండలో వీవీఐపీల తాకిడి నెలకొంది. అయితే చెత్త కూడా అలాగే పేరుకుపోయింది. ఔలి మున్సిపాలిటీ 20 మంది సిబ్బందిని కేటాయించింది. అయితే ఇందుకోసం గుప్తా ఫ్యామిలీ ఎంత కేటాయించిందో తెలుసా .. అక్షరాల రూ.54 వేలు. అవును మీరు విన్నది నిజమే. కొండల్లో పేరుకుపోయిన చెత్తను తీసివేసేందుకు రూ.54 వేలు కేటాయించి చేతులు దులుపుకుంది. వివాహా వేడుకలో మాత్రం 150 క్వింటాళ్ల చెత్త పేరుకుపోయింది. దీనిని శుభ్ర పరిచేందుకు 20 మంది కార్మికులు శ్రమిస్తేనే ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడ పని పూర్తయ్యిందని .. అయితే శుభ్రపరిచేందుకు అయిన మొత్తం, కార్మికులు, వాహనాల వినియోగానికి సంబంధించి బిల్ గుప్తా కుటుంబానికి పంపించామని ఔలి మున్సిపాలిటీ అధ్యక్షుడు శైలేంద్ర పన్వార్ పేర్కొన్నారు.

నివేదిక ఇవ్వండి ..

నివేదిక ఇవ్వండి ..

గుప్తా ఫ్యామిలీ వివాహా వేడుకకు సంబంధించి మీడియాలో చూసి నివేదిక సమర్పించాలని జిల్లా పరిపాలనశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. పెళ్లి వల్ల పర్యావరణానికి ఏమైనా హాని కలిగిందా ? లేదా అనే అంశంపై జూలై 7 లోపు నివేదిక అందజేయాలని స్పస్టంచేసింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 8న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

వివాహ వైభోగమే ...

వివాహ వైభోగమే ...

భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. వివిధ వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్, అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కొడుకు శశాంక్ వివాహం జరిగాయి. ఉత్తరాఖండ్‌లో ఓలి ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి కోసం ఔలీలోని రిసార్టులన్నీ బుక్ చేసుకున్న గుప్తా కుటుంబం దాదాపు రూ.200 కోట్లతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+