నేను సీఎం మాట్లాడుతున్నా: జైల్లో యువకుడు
గుర్గావ్: హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతున్నానని చెప్పి మోసం చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ హోటల్ లో ఉద్యోగంలో చేరడానికి అతను ప్రయత్నించాడు. చివరికి జైలుకు వెళ్లాడు.
ఢిల్లీలో నివాసం ఉంటున్న అమిత్ కుమార్ (29) నిరుద్యోగి. ఇతను గుర్గావ్ లోని ప్రసిద్ధి చెందిన హోటల్ లో ఉద్యోగం కోసం బయోడేటా పంపించాడు. అందులో ఇతన్ని ఉద్యోగంలో తీసుకోండి నేనే సీఎం చెబుతున్నా, నేనే అతనిని సిఫారసు చేస్తున్నాను అంటూ రెజ్యూమ్ మీద తప్పుగా పేర్కొన్నాడు.
అంతే కాకుండా రెండు వారాల క్రితం తాను హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతున్నానని, మీరు అమిత్ కుమార్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని హోటల్ మేనేజ్ మెంట్ తో మాట్లాడాడు.

హోటల్ లో ఓ ఉద్యోగం కోసం సీఎం సిఫారసు చెయ్యడం ఏంటి ? అని హోటల్ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. వెంటనే గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యగా సీఎం పేరుతో ఫోన్ చేసింది అమిత్ కుమార్ అని వెలుగు చూసింది.
వెంటనే పోలీసులు ఢిల్లీ చేరుకుని అమిత్ కుమార్ ను అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హజరుపరిచి పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో మనవి చేశారు. అమిత్ కుమార్ ను విచారణ చెయ్యడానికి పోలీసులకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.












Click it and Unblock the Notifications