వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పించుకోవడానికి పక్కా ప్లాన్: రికార్డుల బాబాకు డాక్టరేట్

డేరా సచ్చా సౌదా చీఫ గుర్మీత్రా్ రహీంను తప్పించడానికి ఆయన అనుచరులు పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ గుర్మీత్రా్ రహీంను తప్పించడానికి ఆయన అనుచరులు పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. గుర్మీత్‌ను అత్యాచారాల కేసులో పంచకుల సిబిఐ కోర్టు దోషిగా తేల్చిన తర్వాత శుక్రవారంనాడు ఆయనను తప్పించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఆ విషయాన్ని హర్యానా పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే, ప్లాన్‌ను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. దోషిగా తేలిన తర్వాత కోర్టు వెలుపల గుర్మీత్‌తో పాటు వచ్చే పోలీసులపై దాడి చేసి బాబాను అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి తరలించాలని ఎత్తులు వేశారు.

హర్యానా పోలీసులు బాబాను వెంట తీసుకుని బయటకు వచ్చారు. స్కార్పియోలో ఆయనను ఎక్కించారు. బాబాకు ఇరు వైపులా భద్రతగా గార్డులు కూడా కారులో కూర్చున్నారు.

ఇలా అడ్డగంచారు....

ఇలా అడ్డగంచారు....

కారు కోర్టు కాంప్లెక్స్‌ను దాటడానికి ఓ పోలీసు బారియర్ నుంచి వెళ్లాలి. అక్కడే బాబా అనుచరులు కాపు కాశారు. అనుకున్న ప్రకారం స్కార్పియో కారు బారియర్‌ను చేరుకునే లోపే తమ కారుతో అడ్డగించారు. బాబాను అప్పగించాలని కేకలు వేశారు. దాంతో పోలీసు వాహనం నుంచి ఆరుగురు అధికారులు కిందకు దిగారు. వారిని చూసి డేరా అనుచరులు కంగు తిన్నారు.

ఏం చేయాలో తోచక...

ఏం చేయాలో తోచక...

సాధారణంగా గార్డులు దోషికి భద్రతగా ఉంటారు. కానీ ఆరుగురు ఆరితేరిన అధికారులు తుపాకులతో కిందకు దిగడంతో కంగు తిన్నారు. బాబాను తప్పించాలా, వెనక్కి వెళ్లిపోవాలా అనే మీమాంసలో పడ్డారు. అయినా కూడా కారును అధికారుల మీదుగా పోనివ్వాలని డ్రైవర్‌కు ఒకతను చెప్పాడు. ఇంతలో ఈ విషయాన్ని గమనించిన మరి కొంత మంది పోలీసులు బారియర్ వద్దకు వచ్చి డేరా అనుచరులను అరెస్టు చేశారు.

ఎఫ్ఐఆర్‌లో విషయాలు....

ఎఫ్ఐఆర్‌లో విషయాలు....

బాబాను తప్పించేందుకు వేసిన ప్లాన్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్‌లో హర్యానా పోలీసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డేరా అనుచరుల కారు నుంచి ఆటోమేటిక్ మెషీన్ గన్, పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

డేరా బాబా చదివింది ఇంతే..

డేరా బాబా చదివింది ఇంతే..

బాబా చదివింది తక్కువే అయినా డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. రామ్ రహీం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 1967 ఆగస్టు 15న ఒక జమీందారీ కుటుంబంలో పుట్టాడు. బాల్యంలో రామ్‌రహీం తన తండ్రికి పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. కేవలం 9 వ తరగతితోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన పేరుతో తిరగడం మొదలు పెట్టాడు. ఏడేళ్ల వయసులోనే గుర్మీత్ ను డేరా సచ్చా‌సౌధా అధ్యక్షుడు షాహ్ సత్నామ్ సింగ్ చేరదీశాడు. తరువాతి కాలంలో సౌధా మొత్తం గుర్మీత్ చేతిలోకి వచ్చింది.

తనను తాను..

తనను తాను..

గుర్మీత్ సింగ్ తనను తాను మల్టీ టాలెంటెడ్‌గా చెప్పుకుంటాడు. తాను నిర్వహించే పలు కార్యక్రమాల ద్వారా నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకునేవాడు. రామ్‌రహీం వరల్డ్ రికార్డులో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. లండన్‌లోని వరల్డ్ యూనివర్శిటీ 2016 సంవత్సరంలో రామ్‌రహీంకు ‘డాక్టరేట్' ప్రదానం చేసింది. అత్యధిక సంఖ్యలో రికార్డులు నెలకొల్పిన వారికి ఈ వర్శిటీ డాక్టరేట్‌లను ఇస్తుంది. ఇటువంటి యూనివర్శిటీ ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే. బాబా పేరు మీద మొత్తం 53 రికార్డులున్నాయి. వీటిలో 17 గిన్నీస్ రికార్డులు, 25 ఆసియా బుక్ రికార్డులు, 7 ఇండియా బుక్ రికార్డులు, 2 లిమ్కా బుక్ రికార్డులు ఉన్నాయి.

English summary
Dera Sacha Soudha chief Gurmeet Ram Rahim Singh escape bid has been foiled by police at Panchakula CBI Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X