జీతం ఇవ్వలేదని ఏకంగా బస్సుతోనే ఉడాయించిన ఘనుడు
గురుగ్రాం: జీతం ఇవ్వడం రెండు రోజులు ఆలస్యం అవడంతో ఓ ప్రెవేట్ స్కూలుకు చెందిన బస్సు డ్రైవర్ ఏకంగా బస్సుతోనే ఉడాయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రాంలో చోటుచేసుకుంది. బస్సుడ్రైవర్ సతీష్‌ను పోలీసులు సోమవారం అసెస్టు చేసి అతని వద్ద నుంచి బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూలు అయ్యాక విద్యార్థులను బస్సులో డ్రాప్ చేసేందుకు వెళ్లిన సతీష్ ఇక బస్సుతో పాటే అటే వెళ్లిపోయాడని... స్కూలు క్యాంపస్‌కు తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. సతీష్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అతని సహచరుడు ఫోన్ చేయగా... జీతం ఇవ్వనందుకు తాను బస్సును ఎత్తుకొచ్చేశానని సమాధానం చెప్పాడు.
స్కూలు తర్వాత సతీష్ బస్సును నడుపుకుంటూ తన ఇంటికి వెళ్లాడని..స్కూలు పార్కింగ్‌లో బస్సుసు పార్క్ చేయలేదని స్కూలు ట్రాన్స్ పోర్టు మేనేజర్ తెలిపాడు. అయితే ఎంతకీ రాకపోవడంతో సతీష్‌కు ఫోన్ చేయగా రెండు రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినందుకు బస్సును తీసుకొచ్చేశానని చెప్పినట్లు మేనేజర్ తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్ 406 కింది పోలీసులు కేసు నమోదు చేశారు. హర్యానా రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న బస్సును అతని నివాసం దగ్గర పార్క్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేవలం జీతం ఆలస్యంగా ఇవ్వడంతోనే సతీష్ ఈ పనికి పాల్పడ్డాడని చెప్పిన పోలీసులు అతన్ని సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే బస్సు దొరకడంతో సమస్య పరిష్కారమైందని స్కూలు ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications