ఢిల్లీలో మరో ఘోరం: యువతి కిడ్నాప్.. వెళుతున్న కారులోనే గ్యాంగ్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

గురుగ్రామ్: ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ యువతిని ఆమె ఇంటి సమీపం నుంచే అపహరించిన ముగ్గురు దుండగులు కారులో ఆమెను తీసుకెళ్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వెళ్తున్న వాహనం నుంచే ఆమెను కిందికి తోసివేసి పరారయ్యారు.

సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ యువతి(22) శనివారం మిత్రులతో కలిసి కన్నాట్‌ప్లేస్‌కు వెళ్లింది. రాత్రి 2 గంటల సమయంలో తిరిగి సెక్టార్‌-17లోని తన నివాసానికి వస్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు.

Gurugram: Three men kidnap and rape a 22-year-old woman from Sikkim in a moving car

మరికొన్ని అడుగులు వేస్తే ఆమె ఇంటికి చేరుకునేది. ఆ లోపే దుండగులు ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం నజాఫ్‌గఢ్‌ వైపు వాహనాన్ని తీసుకెళ్తూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 20 కిమీ దూరం వెళ్లాక ఆమెను రోడ్డుపైకి విసిరి వెళ్లిపోయారు.

బాధితురాలు స్థానికుల సాయంతో జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల్లో ఒకడిని దీపక్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three men allegedly kidnapped and raped a 22-year-old woman from the North East in a moving car in Gurugram and then threw her out on a road in Delhi on Sunday night. The incident took place around 2 am when the woman, who is from Sikkim, was returning to her house in Gurugram’s Sector 17 from Delhi’s Connaught Place, according to NDTV. This comes days after the ghastly gangrape and murder of a 23-year-old woman in Haryana’s Rohtak district, wherein the victim’s body was found in a decomposed and mutilated state
Please Wait while comments are loading...