హెచ్1 బీ వీసా వారికి కష్టాలు: జీతం ఇవ్వకుండా సెలవు, నిలిచిన విమానాలు.. 2 నెలల ముందుగానే..
అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో అక్కడున్న టెకీలు స్వస్థలాలకు వెళ్లడం ఎలా..? వెళితే జీతం ఇస్తారా..? ఉద్యోగం ఉంటుందా.? అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు సందేహాలు ఇస్తున్నారు. జీతం లేకుండా వెళ్లడమే మంచిదని నిపుణులు వారికి సూచిస్తున్నారు.

టికెట్ ఇచ్చి మరీ..
ఆపత్కాలంలో ఉద్యోగులను తీసివేసే అవకాశం లేదు. ఒకవేళ రావొద్దని చెప్పిన అక్కడి కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులకు విధిగా జీతం కట్టించాల్సిందేనని ఉదహరిస్తున్నారు. హెచ్ 1 బీ వీసా ఉన్నవారిని సెటిల్ చేసి ఉద్యోగం నుంచి తీసేయడం ఆ కంపెనీలకు మేలు అని ఆర్లింగ్‌టన్ ఇమ్మిగ్రేషన్ కంపెనీ నేత రాజీవ్ ఎస్ ఖన్నా పేర్కొన్నారు. ఉద్యోగులను పంపించే సమయంలో టికెట్ ఇచ్చి మరీ ఇంటికి పంపించొచ్చు అని సూచించారు.

టెర్మినేషన్ నిబంధనలు
కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేయాలంటే టెర్మినేషన్ నిబంధనలకు హెచ్ 1 బీ వీసా నిబంధనలు అడ్డొస్తాయని న్యూజెర్సీకి చెందిన డెవిడ్ పేర్కొన్నారు. కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగులకు హక్కులు కూడా ఉంటాయని సూచిస్తున్నారు. ఉద్యోగిని ఇంటింకి పంపిస్తారని.. అయితే ఉద్యోగి ఒక్కరికే టికెట్ ఇస్తారని.. అతని కుటుంబసభ్యులకు సదరు ఉద్యోగి కొనుగోలు చేయాలని నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు.

నిలిచిన విమానాలు
అయితే ఆర్థికమాంద్యానిక తోడు.. కరోనా వల్ల అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో హెచ్ 1 బీ వీసా కలిగినవారి జీతంలో కోత విధించడమే ఉత్తమమని మరికొందరు సూచిస్తున్నారు. ఒకవేళ 80 వేల డాలర్లు ఇస్తుంటే 70 వేల డాలర్లకు కుదించొచ్చు అని చెబుతున్నారు. అయితే దీనికి కార్మిక చట్టం నిబంధనలు కూడా వర్తిస్తాయని చెబుతున్నారు.

నో శాలరీ
ఇదీకాకుండా ఉద్యోగులను స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. ఆ సమయంలో వారికి జీతం ఇవ్వమనే కండిషన్ పెట్టాలని మరికొన్ని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హెచ్ 1 బీ వీసా కలిగిన వారిని ఉద్యోగం నుంచి తీసివేస్తే.. 60 రోజుల ముందుగానే వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో సదరు ఉద్యోగి మరో ఉద్యోగం వెతుక్కునే వెసులుబాటు ఉంటుందని.. కార్మిక చట్టం, ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications