ఈవ్ టీజర్లను చితకబాతిన అక్కాచెల్లెళ్లు, వీడియో తీసి...

రోహతక్: తమను వేధిస్తున్న వారికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు బుద్ధి చెప్పారు. ఈవ్ టీజర్లకు ఇదో హెచ్చరిక. అల్లరి చేసేవాళ్లకు తద్వారా వార్నింగ్ ఇచ్చారు. బస్సులో తమని అల్లరి చేసిన ముగ్గురికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు గుణపాఠం చెప్పారు. ఈ సంఘటన హర్యానాలోని రోహతక్‌లో జరిగింది.

లోకల్‌ బస్సు ఎక్కిన వారిని అందులోనే ఉన్న ముగ్గురు యువకులు అల్లరి చేశారు. అంతే ఆ అమ్మాయిలు తమ బెల్టులు తీసి వారిని బాదేశారు. దీనిని వీడియో తీసిన ప్రయాణికులు మాత్రం ఆ యువతులకు మద్దతుగా ముందుకు రాలేదు. అయితే, వారు మాత్రం ఆ ఈవ్ టీజర్లకు బుద్ధి చెప్పారు.

అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవ్ టీజింగ్ చేసిన వారిని కుల్దీప్, మోహిత్, దీపక్‌లుగా గుర్తించారు. తాము ముగ్గురుని అరెస్టు చేశామని, వారిని కోర్టుకు హాజరు పరుస్తామని రోహతక్ ఎస్పీ శషాంక్ ఆనంద్ ఆదివారం రాత్రి తెలిపారు. వారి పైన 354, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Harassed in Public Bus, Sisters Thrash Men

ఈవ్ టీజర్లకు బుద్ధి చెప్పిన అక్కాచెల్లెళ్లు కాలేజీ యువతులు. గత శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నారు. వారు రోహతక్ నుండి తమ గ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఆ వెంటనే బస్సు ప్రయాణీకులతో నిండిపోయింది. ఈ సమయంలో నిందితులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

యువతులు వారిని హెచ్చరించారు. ఆయినా కామెంట్స్ ఆపలేదు. దీంతో ఆ యువతులు వారిని చితకబాదారు. ఒకరు బెల్టు తీసి, మరొకరు చేతితో కొట్టారు. ఒకతను తన సోదరి చేతిని లాగాడని, మరొకరు తన మెడ పట్టుకున్నారని, దీంతో తాము చితకబాదామని ఆ యువతులు చెప్పారు. అనంతరం వారిని బస్సులో నుండి తోసేశారు. దీనిని తోటి ప్రయాణీకులు మైబైల్లో చిత్రీకరించారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+