ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లి
అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. సురేంద్ర నగర్ జిల్లా మౌలి తాలూకా దిగ్సర్ ప్రాంతంలోని ఓ టెంపుల్ లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే త్వరలో అతిథులకు, మిత్రులకు అహ్మదాబాద్ లో విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
పటీదార్ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 2016లో జైలుశిక్ష అనుభవించాడు హార్ధిక్ పటేల్. ఆ సమయంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. హార్దిక్ పటేల్ చెల్లెలి క్లాస్‌మేట్ కావడంతో తరచుగా వారి ఇంటికి వచ్చేవారట కింజల్. అలా పరిచయంగా కాస్తా పెళ్లికి దారితీసింది. 25 ఏళ్ల వయస్సున్న హార్ధిక్ కంటే ఆమె రెండేళ్లు చిన్నది.

కింజల్ పారిఖ్ కుటుంబం స్వస్థలం అహ్మదాబాద్ జిల్లాలోని విరంగం పట్టణం. అయితే కొన్నాళ్ల కిందట సూరత్ లో సెటిలయ్యారు. విరంగం టౌన్ కు కొద్దిదూరంలోని చందన్ నగరి గ్రామానికి చెందినవారు హార్ధిక్. పరిఖ్ - పటేల్ కమ్యూనిటీకి చెందిన కింజల్ కామర్స్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం గాంధీనగర్ లో ఎల్ఎల్‌బీ చదువుతున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications