సోనియా గాంధీ ఆత్మకథకు లైన్ క్లియర్: పబ్లిషింగ్ సస్పెన్స్ కు తెర: మార్కెట్ లో విడుదల తేదీ ఇదే

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ జీవిత చరిత్ర ప్రచురణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకొచ్చి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేగుతున్న వేళ.. హార్పర్‌కాలిన్స్ ఈ బుక్ ను పబ్లిష్ చేయడానికి ముందుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోనియా గాంధీ జీవిత చరిత్ర బుక్ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love). ఈ ఆత్మకథను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా హార్పర్ కాలిన్స్ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇటలీలో గడిచిన సోనియా గాంధీ బాల్య విశేషాల నుంచి భారత్ కు ఆమె ప్రయాణం, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో వివాహం, దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అంశాల వరకు ఈ బుక్ లో ఉండబోతోన్నాయి.

HarperCollins India will publish Sonia Gandhi s memoir amid a controversy over Penguin India decision

ఈ బుక్ ను ప్రచురించే అవకాశం తమకు దక్కడం పట్ల హార్పర్ కాలిన్స్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీవిత చరిత్రలలో ఒకటిగా అభివర్ణించింది. దేశ అంతర్గత రాజకీయ ప్రస్థానాన్ని, అందులోని కీలక పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలించిన ఓ అరుదైన నిశిత వీక్షణను ఈ పుస్తకం పాఠకులకు అందిస్తుందని ప్రచురణకర్తలు పేర్కొన్నారు.

దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్
దెబ్బకు సూపర్ హీరో ఇమేజ్.. అమాంతం పెరిగిన క్రేజ్

సోనియా గాంధీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక నిర్ణయాలు, సంక్షోభాల వెనుక ఉన్న వాస్తవాలు, ఎవరికీ తెలియని రహస్యాలు ఈ ఆత్మకథ ద్వారా వెల్లడి కానున్నాయి. ఈ పుస్తక ప్రచురణ బాధ్యతల నుంచి పెంగ్విన్ సంస్థ అనూహ్యంగా వైదొలగడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపించాయి.

ఆ వివాదాలన్నింటికీ తెరదించుతూ హార్పర్‌కాలిన్స్ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. ఆధునిక భారత సమకాలీన చరిత్ర, రాజకీయ సమీకరణాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఓ అగ్రనేత ఆత్మకథ కావడంతో, అంతర్జాతీయంగానూ ఈ పుస్తకానికి భారీ క్రేజ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న బుక్ కావడం వల్ల హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+