సీనియర్లను రంగంలో దింపిన కాంగ్రెస్

Haryana Assembly election 2024: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది హర్యానా. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది.

హర్యానాలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు.. 90. ఒకే దశలో ఆయా స్థానాలన్నింటికీ కూడా పోలింగ్ షెడ్యూల్ అయింది. అక్టోబర్ 5వ తేదీన ఓటింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదేరోజున లెక్కిస్తారు.

Haryana Assembly elections 2024 Congress appointed AICC senior observers

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 జనరల్ సీట్లు. 17 స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్. మొత్తం 20.1 మిలియన్ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 10.6 మిలియన్ల మంది పురుషులు, 9.5 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 4,52,000 మంది మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కాగా- ఈ ఎన్నికల్లో మొత్తం 89 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక్క స్థానాన్ని మాత్రం మిత్రపక్షం సీపీఎంకు కేటాయించారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా జులానా నియోజకవర్గంపైనే ఉంది. దీనికి కారణం- అక్కడ రెజ్లర్ వినేష్ ఫొగట్ పోటీ చేస్తోండటమే. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు.

ఈ ఎన్నికల్లో పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఏఐసీసీ పరిశీలకులుగా మొత్తం ముగ్గురు నాయకులను అపాయింట్ చేసింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలను అపాయింట్ చేసింది.

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ముగ్గురూ కూడా పార్టీ కేంద్ర పరిశీలకులుగా వ్యవహరిస్తారని, నేరుగా పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకు తమ నివేదికలను అందజేస్తారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+