జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల-ముఖ్యమైన తేదీలివే..!
సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్ తో పాటు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమవుతున్నాయి. హర్యానా అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సీఈసీ రాజీవ్ కుమార్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు.

#WATCH | Chief Election Commissioner (CEC) Rajiv Kumar addresses a press conference to announce the schedule for the General Election to Legislative Assemblies. pic.twitter.com/nIQPVn14lN
— ANI (@ANI) August 16, 2024
జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అమర్ నాథ్ ముగిసిన తర్వాత రోజు అంటే ఆగస్టు 20న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ 9న తొలిదశ ఎన్నికలు, సెప్టెంబర్ 15న రెండో దశ ఎన్నికలు, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే హర్యానాలో ఒకే దశలో అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రెండు రాష్ట్రాలకూ ఒకే రోజు అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
జమ్మూ కాశ్మీర్‌లో 87.09 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 11,800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కశ్మీరీ వలసదారుల కోసం ఎన్నికల సంఘం 26 ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేయనుంది. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటిలో 74 జనరల్, 9 ఎస్టీ, 7 ఎస్సీ రిజర్వుడు సీట్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆర్మీ, బీఎస్ఎఫ్ నుంచి 5 వేల మంది సైనికుల్ని మోహరించనున్నారు. ఇందులో సైన్యం నుండి 2 యూనిట్ల అస్సాం రైఫిల్స్ మరియు బీఎస్ఎఫ్ 2 బెటాలియన్లు ఉన్నాయి.
మరోవైపు హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 2.01 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1.06 కోట్ల మంది పురుషులు, 0.95 కోట్ల మంది మహిళా ఓటర్లు ఇందులో ఉన్నారు. 4.52 లక్షల మంది మొదటిసారి ఓటర్లు (18-19 సంవత్సరాలు)ఉన్నారు. 10,000 కంటే ఎక్కువ మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications