కర్ణాటక సీఎంగా హెచ్.డి. కుమారస్వామి, భార్యతో కలిసి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, పదవి!
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి. ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ విధాన సౌధలో ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు.
కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యకముందే హెచ్.డి. కుమారస్వామి, ఆయన భార్య అనితా కుమారస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 2006 ఫిబ్రవరి నుంచి 2007 ఆగస్టు వరకూ హెచ్.డి. కుమారస్వామి బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.













Click it and Unblock the Notifications