నడుంపై చేయి వేసి.., అందుకే కొరికాను: ఎమ్మెల్యేపై మహిళా ఎమ్మెల్యే
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కే శివదాసన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే తాను అతనిని కొరికానని యూడీఎఫ్ సభ్యురాలు జమీలా ప్రకాశం అన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతనికి తాను చేసిన శాస్తి సరైనదే అన్నారు.
శివదాసన్ వెనుక నుండి తన చేతిని మెలి పెట్టాడని చెప్పారు. నడుముపై చేయి వేశారని ఆరోపించారు. వెనక్కు తిరిగి చూస్తే అతను కనిపించాడని, ఓసారి హెచ్చరించానని.. అయినా తగ్గలేదని, దీంతో తాను కొరికానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని కనీసం ముట్టుకోలేదన్నారు.

మరోవైపు, శివదాసన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని రక్షించేందుకు తాను నిలిస్తే, మహిళా సభ్యురాలు తనను కొరికిందని ఆయన గాట్లు చూపించారు. ఆ సమయంలో తాను ముఖ్యమంత్రి ఊమెన్ పక్కన నిలుచున్నానని చెప్పారు.
ఓ మహిళను ఎవరైనా వేధిస్తే, ఆమె తన నోటి పండ్లు, వేలి గోర్లతో ప్రతిదాడి చేయవచ్చునని సీపీఐ ఎమ్మెల్యే బేబీ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేను కొరికిన మహిళా ఎమ్మెల్యే సభాపతికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications