మా పార్టీలో ప్రియాంక కంటే అందగత్తెలు: బీజేపీ నేత, నవ్వేసిన ప్రియాంక...

బీజేపీ నేత వినయ్ కటియార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక కూడా ధీటుగా స్పందించారు.

లక్నో: బీజేపీ నేత వినయ్ కటియార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అంత అందమైన మహిళ ఏమీ కాదని, ఆమె కంటే అందమైన వారు బీజేపీలోను ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

శివపాల్‌కు అఖిలేష్ ఝలక్, ఎన్నికలవేళ ఎస్పీకి షాక్

ఆయన వ్యాఖ్యల పైన ప్రియాంక కూడా స్పందించారు. వినయ్ వ్యాఖ్యలు బీజేపీ మైండ్ సెట్‌ను తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న సగం జనాభా పైన అది వారి మైండ్ సెట్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలన్నారు.

He makes me laugh: Priyanka Gandhi reacts to BJP leader Vinay Katiyar's not-so pretty remark

అంతకుముందు, కటియార్ మాట్లాడుతూ.. తమ పార్టీలో ప్రియాంక కంటే అందగత్తెలు ఉన్నారని, అయినా ప్రియాంక అంత అందగత్తే కాదని, పైకి కనిపించేందు అందం లేదని ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రచారం కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అందువల్ల ఉపయోగం లేదన్నారు.

ప్రియాంక గాంధీ కంటే అందమైన స్మృతి ఇరానీ తమ పార్టీలో ఉందని చెప్పారు. స్మృతి ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున జనాలు వస్తారని చెప్పారు. అంతేకాదు, ప్రియాంక కంటే స్మృతి ఇరానీ బాగా మాట్లాడుతారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+