దెయ్యం, అతనే రేప్ చేశాడు: అరిచిన ఉబేర్ రేప్ బాధితురాలు

న్యూఢిల్లీ: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ చేతిలో అత్యాచారానికి గురైన మహిళ కోర్టు తీవ్ర ఉద్వేగానికీ ఆవేశానికీ గురైంది. తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కోర్టుకు వచ్చిన ఆమె అతన్ని గుర్తించింది. గట్టిగా కేకలు వేసింది. ఆ దెయ్యమే తనపై అత్యాచారం చేశాడని గట్టిగా అరిచింది. ఢిల్లీ పోలీసులు తమ చార్జీషీట్‌లో ఆ విషయం చెప్పారు.

మెజిస్ట్రేట్ తన వాంగ్మూలాన్ని ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె తమ కస్టడీలోకి తీసుకున్న సమయంలో నిందితుడిని చూసిందని పోలీసులు తెలిపారు. శివకుమార్ యాదవ్‌ను చూడగానే ఆమె గుర్తించిందని, ఆ దెయ్యమే తనపై అత్యాచారం చేశాడని అరించిందని చెప్పారు.

He's the Devil Who Raped Me, Shouted Uber Rape Survivor: Police

డిసెంబర్ 8వ తేదీన బాధితురాలు అతన్ని చూసి అరిచిన సంఘటన జరిగింది. 32 ఏళ్ల శివ కుమార్ యాదవ్‌ను పోలీసులు డిసెంబర్ 7వ తేదీన అరెస్టు చేశారు. అతని ముఖానికి మఫ్లర్ చుట్టి మర్నాడు కోర్టుకు తీసుకుని వ్చచారు. గుర్తింపు పరేడ్ చేయడానికి అతను నిరాకరించాడు. ఉబ్బరంగా ఉందంటూ కోర్టు గది నుంచి బయటకు వస్తూ అతను మఫ్లర్‌ను తీశాడు.

అదే సమయంలో బాధితురాలు మరో కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చింది. అతన్ని చూసి గుర్తించింది. మిత్రులతో విందు తర్వాత ఉత్తర ఢిల్లీలోని తన ఇంటికి వెళ్తుండగా ఆమెపై డిసెంబర్ 5వ తేదీన అత్యాచారం జరిగింది. గుర్గావ్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఆమె పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+