మూడు ఏళ్లు జైల్లో, బెయిల్ మీద వచ్చి వారం రోజుల్లో ఏం చేశాడంటే ?, విద్యార్థిని పిలుచుకుని వెళ్లి !
నేరాలు చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపించి వారిలో మార్పు తీసుకురావడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు చేసేవారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చెయ్యడంతో అతను నేరం చేశాడని రుజువు కావడంతో కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
జైలు జీవితం గడిపిన నిందితుడిలో మార్పు వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ కథ రివర్స్ అయ్యింది. 19 ఏళ్ల వయసులో పోక్సో కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లోనే మరో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబల్లాపుర తాలూకాలోని దొడ్డబెళవంగల మండలంలోని అక్కతమ్మనహళ్లిలో నివాసం ఉండే ఆనంద్ (24) అనే ప్రైవేట్ బస్సు క్లీనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

పాఠశాలకు వెళ్తున్న 14 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న అభియోగంపై పోలీసులు ఆనంద్ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. సోంపూర్‌కు చెందిన ఓ విద్యార్థి పాఠశాలకు వెళ్లి ఇంటికి రాకుండా వారం రోజుల క్రితం అదృశ్యం అయ్యింది. కూతురు అదృశ్యంపై తల్లిదండ్రులు నెలమంగల సమీపంలోని దాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన దాబస్‌పేట పోలీసులు బెంగళూరులోని యలహంక సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్న 14 ఏళ్ల బాలికను రక్షించారు.
బాలికను రక్షించిన పోలీసుల విచారణ చెయ్యగా ఈసారి అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడేు ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

బాధిత బాలిక రోజూ దాబస్‌పేట నుంచి తామగొండ్లులోని పాఠశాలకు ప్రైవేటు బస్సులో వెళ్లేది. నిందితుడు ఆనంద్ ఆమెను బస్సులో కలుసుకుని ఆమెతో పరిచం పెంచుకుని తరువాత ఆమెకు మాయమాటలు చెప్పాడని తెలిసింది.
ఇంటి వెలుతున్న బాలికను తరువాత యలహంకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
2021లో బాదరహళ్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోక్సో కేసులో మూడేళ్ల శిక్ష అనుభవించిన ఆనంద్ గత వారం జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన వారం రోజుల్లోనే మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన కేసులో ఆనంద్ మరోసారి అరెస్టు కావడంతో పోలీసులు, స్థానికులు హడలిపోయారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications