త‌ల నాగ్ పూర్ లో..! మొండెం ర‌ఘునాథ‌ప‌ల్లిలో.! రైలునుండి ప‌డిపోయి యువ‌కుడు..!!

కాజీపేట/ హైద‌రాబాద్ : ఏమ‌రు పాటు ఓ యువ‌కుడి నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొర‌క్క పోతే డోర్ ద‌గ్గ‌ర మెట్ల మీద కూర్చోవ‌డం గ‌మ‌నిస్తుంటాం. కూర్చున్నంత సేపూ ప‌ర‌వాలేదు గాని నిద్ర‌లోకి జారుకుంటేనే ప్ర‌మాదం. ఇదే సంఘ‌ట‌న ట్రైన్ లోని డోర్ ద‌గ్గ‌ద‌ర కూర్చున్న యువ‌కుడికి జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. డోర్ ద‌గ్గ‌ర కూర్చున్న యువ‌కుడు నిద్ర‌మ‌త్తులోకి జారి ప‌డిపోయి ప్రాణాలు తీసుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అత‌డి శ‌రీరం ఖాజీపేట స‌మీపంలో, త‌ల నాగ్ పూర్ లో దొర‌క‌డం మ‌రింత విషాదాన్ని మిగిల్చింది.

 ఘోర మ‌ర‌ణం..! న‌డుస్తున్న రైలునుండి ప‌డిపోయిన యువ‌కుడు..!!

ఘోర మ‌ర‌ణం..! న‌డుస్తున్న రైలునుండి ప‌డిపోయిన యువ‌కుడు..!!

ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడిన వ్యక్తి శరీర భాగాలు నుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన జనగామ జిల్లా రఘునాథపల్లి శివార్లలో శరీర భాగాలు లభ్యమవగా, తల మాత్రం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో లభించింది. రెండు రాష్ట్రాల రైల్వే పోలీసులను పరుగులు పెట్టించిన ఈ ఘటన శనివారం రాత్రి జరగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది.

 తెగి ప‌డిన త‌ల‌ను అతికించిన డాక్ట‌ర్లు..! ఆ త‌ర్వాత పంచ‌నామా..!!

తెగి ప‌డిన త‌ల‌ను అతికించిన డాక్ట‌ర్లు..! ఆ త‌ర్వాత పంచ‌నామా..!!

సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే నాగపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న గుర్తుతెలియని సుమారు 30 ఏళ్ల యువకుడు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు జనగామ-రఘునాథపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జారిపడ్డాడు. ఆదివారం ఉదయం రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నుజ్జయిన శరీర భాగాలను గుర్తించారు. తల లేకపోవడం, చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో శరీర భాగాలను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

నాగ్‌పుర్‌ పోలీసుల సమాచారంతో ఘ‌ట‌న వెలుగులోకి..! త‌ల తెచ్చి అతికించిన వైనం..!!

నాగ్‌పుర్‌ పోలీసుల సమాచారంతో ఘ‌ట‌న వెలుగులోకి..! త‌ల తెచ్చి అతికించిన వైనం..!!

గుర్తు తెలియని వ్యక్తి తల రైలు మెట్లకు చిక్కుకుని ఉండటాన్ని నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌ సిబ్బంది గమనించి అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు అది హత్యా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు ఆరంభించారు. రైలు ప్రయాణించిన మార్గంలోని అన్ని రైల్వే పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అది రఘునాథపల్లి వద్ద జరిగిన సంఘటనలో మరణించిన వ్యక్తి తలేనని కాజీపేట పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చి వాళ్లను సంప్రదించారు.

మ్రుతుడు ఎవ‌రో తెలియ‌దు..! ద‌ర్యాప్తు కొన‌సాగుతోందంటున్న పోలీసులు..!!

మ్రుతుడు ఎవ‌రో తెలియ‌దు..! ద‌ర్యాప్తు కొన‌సాగుతోందంటున్న పోలీసులు..!!

నాగ్‌పుర్‌లో లభించిన తలకు, మృతుడు ధరించిన ముదురు ఎరుపు రంగు బనియన్‌ ముక్కలు అంటుకున్నాయి. అవి మృతుడి శరీరం మీద లభించిన బనియన్‌ ముక్కలతో సరిపోలడంతో ఆ తల ఇక్కడ ప్రమాదంలో మరణించిన వ్యక్తిదేననే నిర్ధారణకు వచ్చిన‌ట్టు ఖాజీపేట రైల్యే పోలీసులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో సోమవారం తలను, మొండేనికి అతికించి పంచనామా నిర్వహించామ‌ని. మృతుడికి సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియరాలేదని కాజీపేట రైల్వే పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+