ఈ డాక్టర్ చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..ఇంతకీ ఏం చేశాడు..?

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అది వేలకిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు ఎవరికైనా గుండెనొప్పి, లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏంటి..? అందులోనే ప్రయాణిస్తున్న ఓ డాక్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స అందిస్తాడు. ఇది సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా ప్రాణాపాయంలో ఉన్న ఓ వ్యక్తిని అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ డాక్టర్ ప్రథమ చికిత్స చేసి కాపాడాడు. ఈ వాస్తవ కథను ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఇంతకీ ఏమా కథ.. ఎక్కడ జరిగింది..?

అది కొచ్చి నుంచి ముంబై వెళుతోన్న ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఆ విమానం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి ముంబైకి టేకాఫ్ అయ్యింది. వేల కిలోమీటర్ల ఎత్తులో విమానం వెళుతోంది. హఠాత్తుగా ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి కూర్చున్న సీటు పక్కనే ఓ డాక్టరు ఉన్నాడు. ఆ రోజు తన విధులు పూర్తి చేసుకుని వెంటనే ముంబై వెళ్లేందుకు ఈ విమానం ఎక్కాడు. అయితే అలసిపోవడంతో ఆ డాక్టరు కాస్త కునుకు తీశాడు. ఈలోపు విమానంలో కాస్త ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఏంటా అని మేల్కొని చూసే సరికి తన పక్కనున్న వ్యక్తి ఊపిరి తీసుకునేందుకు అవస్థపడుతున్నాడు. ఎయిర్‌హోస్టెస్ ఆ వ్యక్తికి నెబులైజర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Healing Wings:A Doctors intervention above the clouds,a skyborne rescue Operation

తన ఆక్సిజన్ లెవెల్స్ 36శాతంకు పడిపోయాయి. ఇక బతికేది కష్టమే అనే స్థాయికి దిగజారిపోయింది ఆయన పరిస్థితి. ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్నా మరో గంట వరకు దగ్గరలో ఎక్కడా ఎయిర్పోర్టు లేదు. వెంటనే అతని పక్కనే ఉన్న డాక్టర్ తన బాధ్యతనెరిగి ఆ వ్యక్తికి చికిత్స అందించే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి చెంత నెబులైజేషన్ కిట్ చూసి ఆస్తమాతో బాధపడుతున్నారా అని అడుగగా లేదని సమాధానం ఇచ్చాడు. ఇక డాక్టర్‌కు తన పరిస్థితి అర్థం కాలేదు. వెంటనే స్టెతోస్కోప్ ఉందేమో అడిగాడు. వెంటనే స్టెతో స్కోప్ పెట్టి గుండె కొట్టుకుంటుందో లేదో చెక్ చేశాడు. అయితే గుండెలో నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆ శబ్దం వినిపించలేదు. దీన్ని మెడికల్ పరిభాషలో ప్ల్యూరల్ ఎఫ్యూజన్ అని అంటారు.

Healing Wings:A Doctors intervention above the clouds,a skyborne rescue Operation

ఇక అదే సమయంలో తన కిడ్నీలు కూడా పాడయ్యాయనే విషయాన్ని ఆ వ్యక్తి డాక్టర్‌కు తెలిపాడు. డయాలసిస్ పై ఉన్నారా అని అడిగితే అందుకా వ్యక్తి వారంలో మూడురోజులు చేయించుకుంటున్నట్లు చెప్పాడు. ఇక మరుసటి రోజే మూడవ సారి డయాలసిస్ చేయించుకోవాలని చెప్పాడు.ఇక తను తీసుకునే మందులు కూడా అయిపోయాయి. దీంతో ఆ వ్యక్తి వద్ద ఉన్న ఫోన్ తీసి అందులో ప్రిస్క్రిప్షన్స్‌ కోసం వెతికాడు. ఒక ప్రిస్క్రిప్షన్ దొరికింది. అందులోని మందులు ఎక్కువగా అధిక రక్తపోటు (బీపీ)కి చెందనవి కావడంతో వెంటనే ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెజర్ చెక్ చేశాడు ఈ డాక్టర్. 280/160గా రికార్డ్ అయ్యింది. హై బీపీకి గురవడంతో తన ఊపిరితిత్తులపై ఆ ప్రభావం పడింది. ఎమెర్జెన్సీ మెడికల్ సర్వీస్ అందించాలంటే ఇంకా గంటపాటు విమానం ప్రయాణించాల్సి ఉంది.అంత వరకు ఈ మనిషి బతికించుకోవడం ఎలా అనేదానిపై ఈ డాక్టరు దృష్టి పెట్టారు.

తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అదంతా ఒక ఐసీయూలా అనిపించింది ఆ డాక్టర్‌కు. వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. మధ్యాకాశంలో ఏంచేయాలో దిక్కుతోచక ముందుగా ఓ ఇంజెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు డాక్టర్. ఆ వ్యక్తి కుడిభాగంలో సరిగ్గా ఉన్న ఒకే ఒక నరానికి డబుల్ పంక్చర్ చేయడం జరిగింది. కానీ అది ఫలించలేదు. దీంతో అతని నడుము భాగం కింద ఓ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రా మస్క్యులర్ ఇంజెక్షన్ ఇచ్చి చాలాకాలం అయ్యింది ఆ డాక్టర్‌కు. ఆ ఇంజెక్షన్‌ వల్ల తీవ్ర నొప్పి ఉంటుందని ముందుగానే ఆ వ్యక్తికి చెప్పాడు డాక్టర్. కానీ తనకు వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఆ వ్యక్తికి బతుకుతాననే ఆశ లేదు. ఆ డాక్టర్‌ పై వాలిపోయాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా ఈ డాక్టర్ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. మరి కొన్ని నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందని చెబుతూ వచ్చాడు. కానీ వాస్తవానికి విమానం ల్యాండ్ అయ్యేందుకు మరో అరగంట సమయం పడుతుంది.

Healing Wings:A Doctors intervention above the clouds,a skyborne rescue Operation

ఇక ఆకాసా ఎయిర్‌లైన్స్ సిబ్బంది డాక్టర్ తన పని చేసుకునేందుకు చాలా సహకరించారు. డాక్టర్ చెప్పినట్లుగా అతనికి కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్ అందించారు. దీంతో ఆ వ్యక్తి ఆక్సిజన్ లెవెల్స్ 90శాతంకు చేరుకున్నాయి. విమానం ఎమర్జెన్సీ కిట్‌లో ఉన్న కొన్ని బీపీ మందులు ఇచ్చారు. ముందుగా బీపీని తగ్గించడం అతని ముందున్న అసలు సవాలు. ఇక విమానం ల్యాండ్ అయ్యింది. ఆ వ్యక్తిని అంబులెన్స్‌లోకి మార్చే ముందు తన ఫోన్ ఇచ్చి ఏదో సంజ్ఞలు చేశాడు. దీంతో ఆ డాక్టర్ తన నెంబర్‌ అందులో ఫీడ్ చేశాడు. ఆ ఒక్క గంట విమాన ప్రయాణం ఒక్కరోజంతా ఐసీయూలో గడిపిన అనుభవాన్నిచ్చాయి ఆ డాక్టర్‌కు.

ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. అయితే బీపీ మాత్రం కంట్రోల్‌లోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులతో డాక్టర్ మాట్లాడాడు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇక మరుసటి రోజు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అతనికి మెసేజ్ చేశారు. తను బాగున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తి పొటాషియం లెవెల్స్ 9.0కు చేరుకున్నాయని, కిడ్నీ పనితీరు కూడా మెరుగుపడిందని చెప్పుకొచ్చారు. విమానం మధ్యాకాశంలో ఉన్న సమయంలో కొంచెం నిర్లక్ష్యం వహించి ఉంటే ఆ వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ అయ్యేదని డాక్టర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు ఆ డాక్టర్. ఇదంతా 2024 జనవరి 14వ తేదీ కొచ్చి నుంచి ముంబై వెళ్లే ఆకాసా ఎయిర్ Qp-1519 విమానంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ డాక్టర్ పేరేంటో తెలుసా.. ఆయన పేరు డాక్టర్ సిరియాక్ అబ్బే ఫిలిప్స్. ఈయన ఆయుర్వేద డాక్టర్. అందులోను లివర్ స్పెషలిస్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+