వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెకాయ్ జారిపోయే వార్త‌..! తాగి డ్రైవ్ చేస్తే మరణశిక్షే...!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్:తాగి వాహ‌నం న‌డ‌పాల‌ను కుంటున్నారా..? ఇక మీరు ఇంటికి కాదు పైలోకం చేరుకున్న‌ట్టే..! తప్పతాగి రోడ్డు మీదు రయ్ రయ్ అని దూసుకెళ్లే వారి గుండె గుభేలుమనే వార్త. ఎందుకంటే ఇకనుంచి డ్రంకెన్ డ్రైవ్ కు మరణశిక్షే. అయితే ఇండియాలో కాదు. తైవాన్లో. ఈ మేరకు ఆ దేశప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. తాగివాహనం నడిపి మనుషుల ప్రాణాలు తీసే వారికి మరణ దండన విధిస్తూ క్రిమినల్ కోడ్ సవరణ ముసాయిదాకు అక్కడి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇత‌ర దేశాలు కూడా తైవాన్ స‌ర్కార్ ప్ర‌యోగం విజ‌య‌వంతం ఐతే, యువ‌త‌ను విచ్చ‌ల‌విడి తాగుడునుండి కాపాడ‌గ‌లిగితే ఇదే శిక్ష‌ను అమ‌లు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 ప్రపంచంలో చాలా దేశాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు..! తాగి న‌డిపితే పెద్ద క్రైమ్..!!

ప్రపంచంలో చాలా దేశాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు..! తాగి న‌డిపితే పెద్ద క్రైమ్..!!

తాగి వాహనాన్ని నడిపి జైలుకెళ్లొచ్చిన వారు ఐదేళ్లలో మళ్లీ అదే నేరం చేస్తే శిక్షా కాలం పెరుగుతుంది.యాక్సిడెంట్లో వ్యక్తులు తీవ్రంగా గాయపడితే 12 ఏళ్ల శిక్ష విధించనున్నారు. ఈ ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. తైవాన్లో తాగినడిపి ప్రాణాలు తీస్తే ప్రస్తుతం పదేళ్ల వరకు శిక్ష విధిస్తున్నారు. ఇప్పుడు ఈ శిక్ష‌ను పెంచే క్ర‌మంలో తైవాన్ ప్ర‌భుత్వం కొన్ని చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. దేశానికి ప‌ట్టుకొమ్మ‌ల్లాంటి యువ‌త ప్రాణాలు కాపాడాలంటే ఈ మాత్రం క‌ఠినంగా ఉండ‌క త‌ప్ప‌దంటోంది అక్క‌డి ప్ర‌భుత్వం.

తాగి న‌డిపితే మ‌ర‌ణ శిక్ష‌..! అవాక్క‌వుతున్న యువ‌త‌..!!

తాగి న‌డిపితే మ‌ర‌ణ శిక్ష‌..! అవాక్క‌వుతున్న యువ‌త‌..!!

తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్న సంఘటనలు తైవాన్లో పెరిగిపోతున్నాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తైవాన్ సర్కారు చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ఓ వ్యక్తితప్పతాగి వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడు.మరో ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చ‌ట్టాల‌ను మార్పు చేసి క‌ఠిన నిర్ణ‌యాలు తీపుకున్న‌ట్టు ఆదేశ ముఖ్య నేత‌లు చెప్పుకొస్తున్నారు.

తైవాన్ స‌ర్కార్ వినూత్న నిర్ణ‌యం..!విజ‌య‌వంతం ఐతే మగ‌తా దేశాలు అమ‌లు చేసే యోచ‌న‌..!!

తైవాన్ స‌ర్కార్ వినూత్న నిర్ణ‌యం..!విజ‌య‌వంతం ఐతే మగ‌తా దేశాలు అమ‌లు చేసే యోచ‌న‌..!!

ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌ కు మరణశిక్ష విధిస్తున్నాయి. చైనాలో గతంలో తాగి వాహనాలు నడిపి మనుషుల్నిబలిగొనే వారికి మరణశిక్ష విధించేవారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ ఈ తరహా శిక్షలు అమల్లో ఉన్నాయి. 2014లో టెక్సస్‌‌‌‌‌‌‌‌లో ఓవ్యక్తి తాగి వాహనం నడిపి నలుగురి ప్రాణాలు తీసినందుకు మరణశిక్ష విధించారు.
తర్వాతజీవిత ఖైదుగా మార్చారు.

 ఉలిక్కి ప‌డుడున్న తాగుబోతులు..! అకాల మ‌ర‌ణాల‌ను నిరోదించొచ్చంటున్న తైవాన్ స‌ర్కార్..!!

ఉలిక్కి ప‌డుడున్న తాగుబోతులు..! అకాల మ‌ర‌ణాల‌ను నిరోదించొచ్చంటున్న తైవాన్ స‌ర్కార్..!!

2005లో మరణశిక్ష అమలును నిలి పేసిన తైవాన్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2010లో మళ్లీ మొదలుపెట్టింది. అంతర్జాతీయ, మానవ హక్కుల సంఘాలు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. గత సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో తన మాజీ భార్యను, కూతురును చంపిన వ్యక్తికి మరణశిక్ష విధించింది. క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ పనిష్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ప్రజలుమద్దతిస్తున్నారని సర్వేలూ వెల్లడించాయి. దీంతో తైవాన్ స‌ర్కార్ ఈ శిక్షను నిర్బ‌యంగా అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

English summary
From now on the death penalty for drunken drive. But not in India. Taiwan. The decision was taken on Thursday. The Cabinet approved the draft amendment to the Criminal Code imposed on the death penalty for those killed by human beings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X