Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబైలో భారీ వర్షం, గాలుల బీభత్సం: బిల్ బోర్డ్ కూలి 8 మంది మృతి, 60 మందికిపైగా గాయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు తోడు పెను ఈదురు గాలులు పలువురి ప్రాణాలు తీశాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్‌ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 60 మందికిపైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో బోర్డ్ కింద చిక్కుకుపోయారు.

సోమవారం సాయంత్రం దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్కోపర్‌, ములుంద్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతోపాటు, ధూళిదుమ్ముతో కూడిన బలమైన గాలులు వీచాయి. చెడ్డా నగర్‌ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. సుమారు 100 మందికిపైగా దాని కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Heavy rain in Mumbai Giant Billboard Falls On People After Dust Storm 8 killed 60 Injured

సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో సహాయకు చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు బృహన్ ముంబై అధికారులు తెలిపారు. కూలిపోయిన హోర్డింగ్ కింద మరో 20-30 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ తెలిపారు.

అంతకుముందుకు ఘటనాస్థలికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​‌నాథ్​ షిండే చేరుకుని పరిశీలించారు. ప్రజలను రక్షించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ముంబై నగరంలోని ఇలాంటి హోర్డింగ్‌లన్నింటినీ సమీక్ష చేయమని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సీఎం షిండే చెప్పారు.

మరోవైపు, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ హోర్డింగ్‌కు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుగుతోంది. ముంబైలోని అన్ని హోర్డింగ్‌లను సరైన ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని సీఎం షిండే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇది ఇలావుంటే, గాలి దుమారం తీవ్రతతో పాటు విజిబిలిటీ పడిపోవడం వల్ల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 15 విమానాలను దారిమళ్లించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విమాన సేవలను పునరుద్దరించారు. ఒక్కసారిగా భారీ వర్షంతోపాటు దుమ్ముధూళితో కూడిన ఈదురుగాలులు వీడయంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి. ఈ అకాల వర్షం ముంబై నగరవాసులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+