జార్ఖండ్ గవర్నర్‌తో హేమంత్ సోరెన్ భేటీ, ఆదివారం 1 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం..

జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎల్పీ నేత హేమంత్ సోరెన్ ఎన్నికయ్యారు. తర్వాత గవర్నర్ ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు.

సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్‌తో హేమంత్ సోరెన్ చర్చించారు. 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని హేమంత్ సోరెన్ చెప్పారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 47 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం జేవీఎం కూడా బేషరతు మద్దతు ప్రకటించడం విశేషం.

Hemant Soren stakes claim to form govt in Jharkhand, will take oath on Dec 29

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఘోర పరాజయం చవిచూసింది. కూటమి 25 సీట్లతో సరిపెట్టుకుంది. దీనికి కారణం ఎన్ఆర్సీ, సీఏఏ కారణమని విపక్షాలు ఆరోపించాయి. మరోవైపు సీఎం రఘుబర్ దాస్ కూడా ఓడిపోవడం విశేషం. తన మాజీ మంత్రివర్గ సహచరుడు సరయూ రాయ్‌పై ఓడిపోయారు. దీంతో పార్టీపై వ్యతిరేకతతోపాటు.. సీఎంపై కూడా ప్రజల్లో వ్యతిరేక స్వరం వినిపించిందని అర్థమవుతోంది.

1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నుంచి రఘుబర్ దాస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదుసార్లు రఘువర్ దాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తూర్పు జంషెడ్‌పూర్ నియోజకవర్గం దాస్‌కు పెట్టిన కోట.. కానీ ఈసారి మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి. మొదటి రౌండ్ నుంచి సరయూ రాయ్ ఆధిక్యంలో దూసుకెళ్లి.. విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+