Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్-అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహం..!
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆయన.. గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేశారు. హేమంత్ పగ్గాలు స్వీకరించేందుకు వీలుగా నిన్న ఆయన బాబాయ్ చంపై సోరెన్ రాజినామా చేయడం, ఆ తర్వాత జేఎంఎం ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ హేమంత్ తండ్రి శిబూసోరెన్ సమక్షంలో సీఎం పగ్గాలు స్వీకరించారు.
భూకుంభకోణం కేసులో చిక్కుకుని జైలు పాలైన హేమంత్ సోరెన్ ను ఈడీ ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను రిమాండ్ కు పంపారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న హేమంత్ సోరెన్ తాజాగా రెగ్యులర్ బెయిల్ లభించింది. దీంతో ఐదు నెలలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన చంపై సోరెన్ నిన్న తప్పుకున్నారు. దీంతో ఇవాళ హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపేందుకు వీలుగా ఆయన సీఎం పదవి చేపట్టినట్లు తెలుస్తోంది.

VIDEO | JMM executive president Hemant Soren (@HemantSorenJMM) takes oath as Jharkhand CM at Raj Bhavan in Ranchi. pic.twitter.com/pEYu9pbqHR
— Press Trust of India (@PTI_News) July 4, 2024
ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో జేఏఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి తగినంత బలం ఉంది. ఈ కూటమిని చీల్చేందుకు గతంలో బీజేపీ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో హేమంత్ సోరెన్ ను జైలుకు పంపింది. అయినా చంపై సోరెన్ రూపంలో ఆయనకు ప్రత్యామ్నాయం లభించింది తప్ప ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా పోయింది. ఇప్పుడు హేమంత్ తిరిగి జైలు నుంచి వచ్చి సీఎం పగ్గాలు చేపట్టారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications