హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ తప్పదా..?
మరికొద్ది రోజుల్లో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హేమంత్ సోరెన్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడ కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన హేమంత్ సోరెన్‌కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. భారీ అంచనాలు మధ్య అధికారం చేపట్టిన హేమంత్ సోరెన్.. ఆ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తన తండ్రి శిబు సోరెన్ రాజకీయ వారసత్వంతో అధికారంలోకి వచ్చిన హేమంత్ సోరెన్ అన్ని రంగాల్లో విఫలం చెందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం ఆ పార్టీకి పెద్దగా మైనస్‌గా మారింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు సైతం హేమంత్ సోరెన్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. గతంలో అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించిన గిరిజన ఓటర్లు , ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారినట్టు తెలుస్తోంది.

అంతర్గత విభేదాలు మరియు పెరుగుతున్న అధికార వ్యతిరేకతతో ఎన్నికల ముందు హేమంత్ సోరెన్ డీలా పడ్డారు. అవినీతి ఆరోపణలు మరియు హామీల అమలు చేయడంలో హేమంత్ సోరెన్ ఘెరంగా ఫెయిల్ అయ్యారని, సామాన్య ప్రజల్లోఆయన పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలుస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా జార్ఖండ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.
గిరిజనుల గుర్తింపును కాపాడటంలో మరియు అక్రమ వలసలపై ఆందోళనలను పరిష్కరించడంలో పార్టీ నిబద్ధత గురించి అందరికి అర్థం అయ్యేలా ప్రచారం చేస్తోంది. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్తూ కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తోంది. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. పైగా జార్ఖండ్‌లో తన పరిధిని విస్తరించడానికి ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కూడా చురుకుగా కొనసాగిస్తోంది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU),జనతాదళ్ యునైటెడ్ (JDU) పార్టీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సిద్ధమవుతుంటే, అధికార పార్టీ మాత్రం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య హేమంత్ సోరెన్ ఎలా గట్టెక్కుతారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications