సీఎంను ముంచిన తేల్చిన కుటుంబ సభ్యులే..!
మరికొద్ది రోజుల్లో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈక్రమంలోనే గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. ముఖ్యంమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మరోసారి అధికారమే చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన హేమంత్ సోరెన్‌కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. భారీ అంచనాలు మధ్య అధికారం చేపట్టిన హేమంత్ సోరెన్.. ఆ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన తండ్రి శిబు సోరెన్ రాజకీయ వారసత్వంతో అధికారంలోకి వచ్చిన హేమంత్ సోరెన్ అన్ని రంగాల్లో విఫలం చెందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇదే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం ఆ పార్టీకి పెద్దగా మైనస్‌గా మారింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలు సైతం హేమంత్ సోరెన్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. అంతర్గత విభేదాలు మరియు పెరుగుతున్న అధికార వ్యతిరేకతతో ఎన్నికల ముందు హేమంత్ సోరెన్ డీలా పడ్డారు.అవినీతి ఆరోపణలు మరియు నెరవేర్చని వాగ్దానాలు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇక ఈసారి జరిగే ఎన్నికల్లో హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించారు. సీఎం హేమంత్ సోరెన్ తన సొంత నియోజకవర్గమైన బర్‌హేట్ (ఎస్టీ) నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేదర్ హజారా ఇటీవల హేమంత్ సోరెన్ పార్టీలో చేరారు. ఆయనకు జమూనా నియోజకవర్గం టికెట్ కేటాయించారు. హేమంత్ సోరెన్ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. 'ఇండియా' కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జేఎంఎం 70 చోట్ల, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు 11 చోట్ల పోటీ చేస్తున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications