Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరో సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఎంత ?, ఒక్క బిల్డింగ్ కే అన్ని రూ. కోట్ల అద్దె వస్తుందా !

ముంబాయి: సినీ రంగంలో ఉంటున్న టాప్ హీరోలు (Hero) ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేసి జీవితంలో సెటిలిల్ అయిపోతారో కొత్తగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలతో పాటు క్రికెట్ రంగంలో ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు భారీ మొత్తంలో స్థిరాస్తులు (property) కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు వివిద వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

బాలీవుడ్ (bollywood) కండల వీరుడు సల్మాన్ ఖాన్ చాలా కాలంగా కమర్షియల్ ఆస్తులు కొనుగోలు చేసి భారీ మొత్తంలో అద్దెలకు ఇస్తున్నాడని వెలుగు చూసింది. ముంబాయితో పాటు దేశంలోని ప్రముఖ నగరాలు, విదేశాల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు భారీ మొత్తంలో స్థిరాస్తులు (property) ఉన్నాయని తెలిసింది. ముంబాయిలో సల్మాన్ ఖాన్ కు (salman khan) చెందిన ఓ కమర్షియల్ కాంప్లెక్స్ విషయం ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది.

Hero Salman Khan has rented out a commercial building in Mumbai to a company for Rs 1 crore per month.

బాలీవుడ్ (bollywood) సీనియర్ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (salman khan) ముంబాయిలోని శాంతాక్రూజ్‌లోని ఆయన వాణిజ్య ప్రాపర్టీని 60 నెలల పాటు అద్దెకు ఇచ్చాడు. ఓ భవంతిలోని 2,140.71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న తన ఆస్తిని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (salman khan) ల్యాండ్‌క్రాఫ్ట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 5.4 కోట్ల రూపాయల డిపాజిట్ మొత్తానికి అద్దెకు ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు వ్యాపార (businessman) రంగంలో హాట్ టాపిక్ అయ్యింది.

కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ ప్రాప్‌స్టాక్ ద్వారా యాక్సెస్ చేయబడిన పత్రాల ప్రకారం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (salman khan) ముంబాయిలోని శాంతాక్రజ్‌లో ఉన్న తన వాణిజ్య ఆస్తిని ఆగస్టు నెల నుండి 60 నెలల పాటు ఓ సంస్థకు అద్దెకు ఇచ్చాడు.

2,140.71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న తన ఆస్తిని సల్మాన్ ఖాన్ ల్యాండ్‌క్రాఫ్ట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ 5.4 కోట్ల రూపాయల డిపాజిట్ మొత్తానికి అద్దెకు ఇచ్చారు.ఆస్తి దిగువ అంతస్తు, నేల అంతస్తు, మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తును కలిగి ఉంటుంది. ప్రాప్‌స్టాక్ ప్రకారం (salman khan) అద్దె ఒప్పంద లావాదేవీ (property) ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన జరిగింది. అయితే ఈ విషయం కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చినా ఇప్పుడు బాలీవుడ్ లో అదే విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది.

Hero Salman Khan has rented out a commercial building in Mumbai to a company for Rs 1 crore per month.

ముంబాయిలో రిజిస్టర్ కార్యాలయంలోని పత్రాల ప్రకారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (salman khan) మొదటి సంవత్సరంలో నెలవారీ (property) అద్దె రూ.90 లక్షలను తీసుకుంటాడు. రెండో ఏడాది అద్దె రూ. కోటికి పెరుగుతుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షల మేర పెరుగుతుందని అంచనా. మూడో ఏడాదికి రూ. 1. 05 కోట్లు, నాల్గవ సంవత్సరం రూ 1.10 కోట్లు, ఐదవ సంవత్సరానికి 1.15 కోట్లు చొప్పున సల్మాన్ ఖాన్ అద్దె చెల్లించడానికి ఆ సంస్థ నియమాల ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంది.

ప్రతినెల కోట్లలో సల్మాన్ ఖాన్ కు ఈ భవనం నుంచి అద్దె అందనుంది. సల్మాన్ ఖాన్ కు (salman khan) చెందిన ఈ కమర్షియల్ భవనం నుంచి ఒక్క నెలకు సుమారు కోటి రూపాయలు అద్దె (property) వసూలు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కేవలం ఒక్క కమర్షియల్ కాంప్లెక్స్ లోని మూడు అంతస్తుల భవనం నుంచి సల్మాన్ ఖాన్ ఇంత భారీ మొత్తంలో అద్దె వసలూ చెయ్యడంతో అందరూ అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ కు (bollywood) చెందిన నటీనటులు ముంబాయితో పాటు విదేశాల్లో భారీ మొత్తంలో స్థిరాస్తులు సంపాధించారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్‌లతో సహా పలువురు ఇతర నటులు కూడా ముంబాయిలోని అంధేరీ వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ భవనంలో కమర్షియల్ ఆస్తులను (property) కొనుగోలు చేశారు. మొత్తం మీద ఓ భవనం నుంచి సల్మాన్ ఖాన్ కు (salman khan) సుమారు కోటి రూపాయల అద్దె వస్తుండటంతో ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుందో అంచనా వెయ్య వచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+