Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య కోసం స్టార్ హీరో బైక్ ర్యాలీ, ఫ్యాన్స్ ఎంట్రీ, మంత్రి ఎంట్రీతో హాట్ టాపిక్. అంతా ఒకే ఫ్యామిలీ !

కర్ణాటకలోని శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ కోసం ఆమె భర్త, స్యాండిల్ వుడ్ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ నిమిషం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గీతా శివరాజ్ కుమార్ సోదరుడు, కర్ణాటక మంత్రి మధు బంగారప్ప బైక్ ర్యాలీలు నిర్వహించి ఆమెకు మద్దతుగా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శివమొగ్గలో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తోంది

లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కర్ణాటక రాష్ట్రంలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగిపోయి పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారి పేర్లు ప్రకటించడం కూడా జరిగిపోయింది. దీంతో పాటు ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థులకు కార్యకర్తలకు బ్రహ్మరథం పట్టారు.

Hero Shivraj Kumar organized a bike rally to win his wife Geeta Shivraj Kumar

శివమొగ్గలో గీతా శివరాజ్‌కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, తన సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌ ను భారీ మోజారిటీతో గెలిపించాలని శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గంలో హీరో శివరాజ్ కుమార్ బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గోన్న శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి జోరు పెంచారు. గీతా శివరాజ్‌కుమార్‌ సోదరుడు మధు బంగారప్ప కూడా బైక్‌ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యాలని మనవి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను హీరో శివరాజ్ కుమార్ ఆయన సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లలో పంచుకున్నారు. గీతా శివరాజ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆమెకు మద్దతుగా నిలుస్తున్న నటుడు శివరాజ్‌కుమార్‌ తన భార్యను ఎంపీగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. భర్తగా నేను ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటాను. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత నేను చాలాసార్లు శివమొగ్గకు వ‌చ్చాను అని, తాను శివమొగ్గను మరిచిపోను అని, ఇది నా పుట్టినిల్లు అని గీతా శివరాజ్ కుమార్ అంటున్నారు.

Hero Shivraj Kumar organized a bike rally to win his wife Geeta Shivraj Kumar

ఈసారి తాను గెలుస్తానని గీతా శివరాజ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కన్నడ సినీ నిర్మాత కూడా అయినా గీతా శివరాజ్ కుమార్ ఆమె భర్తతో కలిసి శివమొగ్గ వీధుల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శివమొగ్గలో గీతా శివరాజ్‌కుమార్‌పై బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ, బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు.

అలాగే బీజేపీ సీనియర్ నేత, కేఎస్ ఈశ్వరప్ప పార్టీపై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇది గీతకు లాభించే అవకాశం ఉంది. తన భార్య గీత కోసం విజ్ఞప్తి చేసిన నటుడు శివరాజ్‌కుమార్, 'నా భార్యను గెలిపించండి. గీత గెలిస్తే నేను పని చేసి సాధిస్తాను. నా భార్యకు నేను గ్యారంటీ, నా భార్య పని చేస్తుంది. దీనికి హామీ ఇస్తానని హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+