ఫ్యాన్స్ కు థ్యాక్స్ తో పాటు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో, అందరూ గెలవాలి !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 సందర్బంగా స్యాండిల్ వుడ్ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పలువురు స్యాండిల్ వుడ్ నటీనటులు ఎన్నికల ప్రచారం చేశారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో పాటు బీజేపీ నాయకుల తరపున ఎన్నికల ప్రచారం చేసిన స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

కర్ణాటకతో పాటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన కిచ్చా సుదీప్ కు కర్ణాటకలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కిచ్చా సుదీప్ కు కర్ణాటకలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. నటుడిగానే కాకుండా కిచ్చా సుదీప్ దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్ లో కిచ్చా సుదీప్ కు మంచి క్రేజ్ ఉంది.

Karnataka assembly elections

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పాటు కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు వాల్మీకి కులానికి చెందిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిచ్చా సుదీప్ మే 8వ తేదీ వరకు పలు నియోజక వర్గాల్లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా కిచ్చా సుదీప్ ఆయన అభిమానులను ఉద్దేసించి ట్విట్టర్ లో కొన్ని పోస్టు చేశారు. కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో తాను ఎన్నికల ప్రచారం చేశాను. దారిపోడవునా తనకు పూలాభిషేకం చేశారు. గజమాలలు వేసి కర్పూరహారతలు పట్టారు. మీ అభిమానంతో తాను ఎంతో పులకించిపోయానని ట్విట్ చేశారు.

కర్ణాటకలో తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానులకు తాను పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని, నేను మీ రుణం తీర్చుకోలేనని, అభిమానదేవుళ్లు జీవితాంతం తన వెంట ఉంటారని, తన మీద మీ అభిమానం ఇలాగే ఉండాలని ఆదేవుడిని వేడుకుంటున్నానని, ఇంత మంది అభిమానులు చిక్కినందకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని హీరో సుదీప్ ట్వీట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సందర్బంగా తను ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లిన సమయంలో పలుచోట్ల లాఠీచార్జ్ జరిగింది. ఆ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న తన అభిమానులు, ప్రజలకు తాను బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని, ఇంకోసారి తన అభిమానులకు ఇలాంటి చేదుఅనుభవాలు ఎదురుకాకుండా చూసుకుంటానని హీమీ ఇస్తున్నానని కన్నడ స్టార్ హీరో సుదీప్ ట్విట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తన సన్నిహితులు, స్నేహితులు అందరూ విజయం సాధించాలని హీరో సుదీప్ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సవ్యంగా సాగడానికి మొదటి నుంచి తనతోడు ఉన్న చక్రవర్తి చంద్రచూడ్ కు హీరో సుదీప్ ప్రత్యేక ధన్యవాదులు చెబుతూ ఆయనతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+