హైటెక్ మసాజ్ సెంటర్, లోపల సినిమా స్టోరీ వేరే, సోషల్ మీడియాలో అన్ని డీలింగ్స్ !
ఉద్యోగం చెయ్యడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఐటీ హబ్ కు యువతి, యువకులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఎవరి చదువులకు తగ్గట్లు వారు ఉద్యోగాలు వెతుక్కోవడం చేస్తుంటారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన అందమైన యువతులు, మహిళలను టార్గెట్ చేసుకున్న కొందరు వ్యక్తులు కొత్త దందాకు తెరలేపారు. మసాజ్ సెంటర్, స్పా అంటూ అసలు కథ నడిపిస్తున్నారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే వ్యక్తి మడివాళ సమీపంలో ఓ అద్దె ఇంటిని తీసుకున్నాడు. ఇల్లు పూర్తిగా అతని హ్యాండోవర్ లో ఉంది. ఇంటి బయట మసాజ్ సెంటర్ అని బోర్డు తగిలించిన మంజునాథ్ లోపల విలాసవంతమైన సెటప్ సెట్ చేశాడు. ఇదే సందర్బంలో ముంబాయి, గోవా, కోల్ కత్తా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు అందమైన యువతులు, ఆంటీలను టార్గెట్ చేశాడు.

మసాజ్ సెంటర్ లో ఉద్యోగం చేస్తే మీకు నెలకు వేలల్లో జీతాలు ఇస్తానని నమ్మించిన మంజునాథ్ వారిని ఉద్యోగాల్లో పెట్టుకున్నాడు. తరువాత సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్ లు తెరచిన మంజునాథ్ అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోటోలు పోస్టు చేశాడు. అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలంటే తనకు ఫోన్ చెయ్యాలని మూడు ఫోన్ నెంబర్లు పెట్టాడు. తరువాత ఫోన్ లోనే అమ్మాయిలను బట్టి రేట్ ఫిక్స్ చేశాడు.
సోషల్ మీడియాలోనే విటులను ఆకర్షించిన మంజునాథ్ వారితో డీల్ మాట్లాడుకుని మసాజ్ సెంటర్ కు పిలిపించి అమ్మాయిలు, ఆంటీలతో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నాడు. కేటుగాడు మంజునాథ్ వ్యవహారం తెలుసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అతను నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ మీద దాడి చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ఇదే సమయంలో కొందరు యువతలను పోలీసులు రక్షించారు.
నిందితుడు మంజునాథ్ గత రెండేళ్లుగా నిరంతరం హైటెక్ వ్యభిచారం వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు అన్నారు. మడివాళ, పుట్టేనహళ్లి, మైకో లేఅవుట్, ఎస్‌జీ పాళ్య, హుళిమావు పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో మసాజ్ సెంటర్ ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసులు అన్నారు. ఇదే కారణంతో నిందితుడు మంజునాథ్ ఇప్పటికే ఆరుసార్లు జైలుకెళ్లి బయటకు వచ్చి తన పాత పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న నిందితుడు మంజునాథ్ ను గూండా చట్టం కింద బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications