Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: ఎంపీల లెటర్ హెడ్లతో కార్యకలాపాలు!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశేషమేంటంటే ఆదాయపన్ను శాఖ అధికారులు అందించిన సమాచారంతో పోలీసులు ఈ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రితీంద్రనాథ్ సన్యాల్ (62) అనే వృద్ధుడిని అరెస్ట్ చేశారు.

సన్యాల్.. బిజెపి, ఎస్పీ ఎంపీల నకిలీ లెటర్ హెడ్స్‌తో సెక్స్ రాకెట్ వ్యవహారాలను చక్కబెట్టుకుంటుండటం గమనార్హం. దాదాపు నెల రోజుల క్రితం సన్యాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు అతడితో పాటు ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఓ మహిళ ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు పోలీసులకు ఉప్పందించారు.

అరెస్టయిన సన్యాల్‌తో పాటు ఉజ్బెక్ మహిళ అందించిన సమాచారం ఆధారంగా రిటైర్డ్ కల్నల్ అజయ్ అహ్లావత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు.

High profile Delhi sex racket catering to MPs, army officers busted

కానీ, ఇప్పుడా కల్నల్ కనిపించడం లేదు. తనను పెద్దమనుషుల వద్దకు పంపేవారని, వాళ్లలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆయుధ డీలర్లు, రాజకీయ నాయకులు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉండేవారని ఉజ్బెక్ మహిళ తెలిపింది. సన్యాల్ ఇంటిమీద దాడి చేసినప్పుడు పోలీసులకు ఫోర్జరీ చేసిన ఎంపీల లెటర్‌ హెడ్లు కూడా దొరికాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ లా నటించి.. ఉన్నతాధికారులతో పనులు చేయించుకునేవాడు సన్యాల్. దక్షిణాసియా దేశాలకు చెందిన పలువురు మహిళల పాస్ పోర్టుల కాపీలు, ఫోన్ నంబర్లు కూడా ఆ ఇంట్లో ఉన్నాయి.

సన్యాల్ ఫోన్ మెసేజ్‌లలో విదేశీ మహిళలతో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీల వివరాలున్నాయని డీసీపీ ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు ఉజ్బెక్ మహిళ తాను అనుభవిస్తున్న నరకాన్ని వాళ్లకు వివరించి, తనను కాపాడాల్సిందిగా కోరింది. దాంతో వాళ్లు పోలీసులకు విషయం చెప్పారు.

చివరకు మొత్తం రాకెట్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన పోలీసులు.. సన్యాల్ మీద ఐపీసీ సెక్షన్లు 370, 370ఎ, 341, 342, 419, 120బి కింద కేసులు పెట్టారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు. కాగా, ఎంపీ నరేష్ అగర్వాల్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తన పేరును చెడుగా వాడినందుకు సన్యాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు. తనకు ఈ వ్యవహారలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+