వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలకు గుడ్‌బై, ఫేస్‌బుక్ సీఈఓగా పనిచేయాలనే కోరిక:హిల్లరీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రాజకీయాల నుండి పూర్తి స్థాయిలో నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్టు హిల్లరీ క్లింటన్ భావిస్తున్నారని సమాచారం. ఫేస్‌బుక్ కు సీఈఓ గా కావాలని భావిస్తున్నారని మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

రాజకీయాల నుండి పూర్తిగా హిల్లరీ క్లింటన్ తప్పుకోవాలని భావిస్తున్నారని మీడియా కథనాలు వెలువుడుతున్నాయి. 2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, ట్రంప్ పోటీ చేశారు. హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ విజయం సాధించారు.

శుక్రవారం హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి రాడ్‌క్లిఫ్‌ మెడల్‌ను అందుకునేందుకు వచ్చిన హిల్లరీ క్లింటన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కథనాలు కూడ ప్రచురించాయి.

Hillary Clinton wants to be Facebook CEO

మసాచుసెట్స్‌కు చెందిన ఓ డెమొక్రాట్‌ మీరు ఏ కంపెనీకి సీఈవో కావాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఫేస్‌బుక్‌ లేదా సీనెట్‌లకు అని ఆమె తడుముకోకుండా చెప్పినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌ నుంచి ప్రపంచంలో చాలామంది వార్తలు తెలుసుకుంటారని, అవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న విషయాన్ని సైతం పట్టించుకోరని హిల్లరీ పేర్కొన్నారు. కాగా, నకిలీ వార్తలు, కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణాలతో ఫేస్‌బుక్‌ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీ వీటి నుంచి బయటపడుతోంది.

కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ అమెరికా అధ్యక్షు ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం ఫేస్‌బుక్ నుండి యూజర్ల డేటాను సేకరించిందనే ఆరోపణలు ఎదుర్కొంది.ఈ విషయం ఇటీవలనే బయటకు వచ్చింది.ఈ విషయమై పెద్దఎత్తున దుమారం రేగుతోంది.

English summary
Former US Secretary of State Hillary Clinton might be willing to swap a life in politics to lead the world's largest social-networking company, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X