సీఎంతో నాకు ఎఫైర్ ఉంది: గాయని సంచలనం
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చిక్కుల్లోకి నెట్టి ఆరోపణలు ఇటీవల వెలుగుచూశాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్, తానూ మనసులు ఇచ్చి, పుచ్చుకున్నామని గాయని అలోక పాండే తన గత కాలపు మధురానుభూతులను ఓ టీవీ ఇంటర్వ్యూలో నెమరు వేసుకున్నారు.
తన తల్లి, ప్రముఖ జానపద గాయని ప్రతిమ బారువా పాండే మరణించడంతో ఉద్యోగం కోసం తాను తరుణ్ గొగోయ్‌ని 2004లో కలిసినట్లు అలోక పాండే తెలిపారు. తనను చూసిన తరుణ్ పరవశుడయ్యారని, ఇరువురం 2004 నుంచి 2006 వరకు ప్రేమలో మునిగి తేలామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి అధికార నివాసం కోయినధారలో అణువణువూ తనకు తెలుసునని తెలిపారు. అందులోని ప్రతి గది ముచ్చట తనకు ఎరుకేనన్నారు. అంతేగాక, గౌరిపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని చెప్పడంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అలోకా పాండే తెలిపారు.

సీఎంతో తనకు ఎఫైర్ ఉందన్న విషయం చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలకు, మంత్రులకు కూడా తెలుసునని ఆమె చెప్పారు. కాగా, అలోక పాండే 2006లో ఈ విషయాన్ని బయటపెట్టినపుడు తరుణ్ గొగోయ్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
తాజాగా ఆమె అవే ఆరోపణలను మళ్లీ చేయడంపై తరుణ్ గొగోయ్ స్పందిస్తూ.. ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఈసారి తాను పరువు నష్టం దావా వేయబోనని స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలో గతంలో శక్తిమంతమైన నేత హిమాంత బిశ్వ శర్మ భార్య నడుపుతున్న ఛానల్‌లో అలోక పాండే ఇంటర్వ్యూ ప్రసారమైందని, హిమాంత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేశారని తరుణ్ గొగోయ్ ఆరోపించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications