Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hindi: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అజ్ఞానంలో ఉన్నారు, మాజీ ఎంపీ, నటి రమ్యా ఫైర్, నిద్రలేవండి సార్ !

బెంగళూరు: హిందీ జాతీయ బాష అని చెప్పిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కు కన్నడ స్టార్ హీరో, బహుబాష నటుడు, దర్శక నిర్మాత కిచ్చ సుదీప్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కిచ్చ సుదీప్ ను టార్గెట్ చేసుకుని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో ఆయన మీద విరుచుపడిన విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ రమ్యా కూడా అజయ్ దేవగన్ మీద విరుచుకుపడ్డారు. హిందీ బాషను మీరు జాతీయ బాష అంటున్నారు, మీ అజ్ఞానానికి నేను బాధపడుతున్నానని మాజీ ఎంపీ, నటి రమ్యా అజయ్ దేవగన్ మీద విరుచుకుపడ్డారు.

 Hindi: Ajay Devgn tweet over Hindi national language, Sandalwood Actress Ramya reactions reactions.

ఆర్ఆర్ఆర్, పుష్పా, కేజీఎఫ్-2 లాంటి సినిమాలు హిందీలో ఘనవిజయం సాధించాయని మీరు గుర్తు చేసుకోవాలని నటి రమ్యా ట్విట్ చేశారు. మీరు మా సినిమాలను చూసి ఆనందించండి, మేము మీ సినిమాలు చూసి ఆనందిస్తాము, అంతే కాని మీరు హిందీ బాష జాతీయ బాష అని నొక్కిచెప్పితే ఇక్కడ వినడానికి ఎవ్వరూ సిద్దంగా లేరని నటి రమ్యా మండిపడ్డారు.

మీరు బాషల విషయంలో ప్రాంతీయ విభేదాలు తలఎత్తేలా చెయ్యకూడదని నటి రమ్యా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కు మనవి చేశారు. ఓ సినిమా కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ బాష జాతీయ బాష కాదు అని చెప్పారు. కిచ్చ సుదీప్ మాటలకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కౌంటర్ ఇచ్చారు. అజయ్ దేవగన్ సార్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని నేరుగా కలిసిన తరువాత నేను ఎందుకు అలా మాట్లాడాను అనే విషయంలో క్లారిటీ ఇస్తానని కిచ్చ సుదీప్ కూడా అజయ్ దేవగన్ కు కౌంటర్ గా ట్విట్ చేశారు. అప్పుడు కన్నడ నటీనటులు హిందీ బాష విషయంలో అజయ్ దేవగన్ ను టార్గెట్ చేసుకుని కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+