Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోడీని చంపేస్తామంటూ ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూం​కు ఫోన్ చేసి ప్రధాని మోడీని హతమారుస్తానని బెదిరించాడు. గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోడీని చంపేస్తానని హిందీలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్​‌ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు? ఏ సిమ్ కార్డు వాడాడు? అనే విషయాలను తెలుసుకునే పనిలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు.

hindi speaking person call to NIA office in chennai threatened to kill pm narendra modi

కాగా, వాంటెడ్ క్రిమినల్స్‌​ను పట్టుకోవడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసు కంట్రోల్ నంబర్‌లను ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ నెంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోడీని హతమారుస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.

గతంలోనూ బెదిరింపులు

కాగా, గతంలోనూ మోడీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​‌ను ​ చంపుతానంటూ కొన్నాళ్ల క్రితం ఓ దుండగుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు.

నోయిడాలోని ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్​ ఆఫీసర్​‌కు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్​లో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఆ మీడియా సంస్థ ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. [email protected] అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. దేశ ప్రధానినే చంపుతామని బెదిరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసు సీరియస్‌​గా తీసుకుని విచారణ చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+