Love Jihad: లవ్ జీహాద్ ఓ గేమ్, ట్రిక్, హిందూ అమ్మాయిలు, గుడ్డు కూడా లేదు, మెట్రోమ్యాన్ !
కొచ్చి/లక్నో/ చెన్నై: లవ్ జీహాద్ అనేది ఒక గేమ్ లాగా, ట్రిక్ లాగా తయారైయ్యిందని, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడటానికి ఆ పదం తెరమీదకు తెచ్చారని మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్ ఆరోపించారు. లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి జీవితాలను సర్వనాశనం చేసిన విషయం తాను కళ్లారా చూశానని మెట్రోమ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే నేను సీఎం అభ్యర్థి రేసులో ఉంటానని మెట్రోమ్యాన్ అన్నారు. ఢిల్లీలో మెట్రో రైలు ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర పోషించింని కేరళ శ్రీధరన్ భారతదేశం మెట్రోమ్యాన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ జీహాద్ అనే పేరుతో చాలా మంది ఎవరు ఎలా మోసపోతున్నారని తనకు తెలుసని, అందుకే తాను లవ్ జీహాద్ ను వ్యతిరేకిస్తున్నానని శ్రీధరన్ చెప్పారు.

ఢిల్లీలో మెట్రో రైలు
ఢిల్లీలో మెట్రోరైలు పట్టాలు ఎక్కడానికి టెక్నోక్రాట్ ఇ. శ్రీధరన్ చాలా శ్రమించారు. ఢిల్లీలో మెట్రోరైలు పట్టాలు ఎక్కడంలో కీలకపాత్ర పోషించిన శ్రీధరన్ భారతదేశం మెట్రోమ్యాన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెట్రోమ్యాన్ అంటే వెంటనే అందరూ చెప్పే పేరు శ్రీధరన్. కేరళకు చెందిన 88 ఏళ్ల శ్రీధరన్ తాను బీజేపీలో చేరుతానని ఇటీవలే ప్రకటించారు.

లవ్ జీహాద్ గేమ్ తో జీవితాలు నాశనం
లవ్ జీహాద్ అనేది ఒక గేమ్ లాగా, ట్రిక్ లాగా తయారూయ్యిందని, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడటానికి ఆ పదం తెరమీదకు తెచ్చారని మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరన్ ఆరోపించారు. కేరళలో లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి జీవితాలను సర్వనాశనం చేసిన విషయం తాను కళ్లారా చూశానని మెట్రోమ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు
లవ్ జీహాద్ పేరుతో కేరళలో హిందూ అమ్మాయిలు మోసపోతున్నారని, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటున్న ముస్లీం అమ్మాయిలు, క్రిస్టియన్ అమ్మాయిలు కొందరు ఇలాగే ఆ గేమ్ కు బలి అవుతున్నారని శ్రీధరన్ విచారం వ్యక్తం చేశారు. అమాయకులైన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని లవ్ జీహాద్ తెరమీదకు తెచ్చారని, తాను లవ్ జీహాద్ ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నానని మెట్రోమ్యాన్ శ్రీధరన్ అన్నారు.

యూపీ, మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది ?
ఉత్దరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో లవ్ జీహాద్ కట్టడికి కొత్త చట్టాలు తీసుకువచ్చిన తరువాత ఆ రాష్ట్రాల్లో లవ్ జీహాద్ కేసులు తగ్గాయని శ్రీధరన్ అన్నారు. తాను మాంసాహారం ఇష్టపడనని, నేను కనీసం కోడిగుడ్డు కూడా తినని, మాంసాహారం తినేవాళ్లు అంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని శ్రీధరన్ అన్నారు. కేరళలో గోమాంసం విక్రయాలను వ్యతిరేకిస్తున్న వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని శ్రీధరన్ అన్నారు.

సీఎం అభ్యర్థి రేసులో ఉన్నా
కేరళలో ఎప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. కేరళలో బీజేపీ అధిక సీట్లు కైవసం చేసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తోందని, నేనుకూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నానని మెట్రోమ్యాన్ శ్రీధరన్ అన్నారు. కేరళను అభివృద్ది చెయ్యడానికి తనవంతు కృషి తాను చేస్తానని, కచ్చితంగా బీజేపీ విజయానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications