హిట్ అండ్ రన్ కేసు: సల్మాన్‌కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కోర్టు సల్మాన్‌కు నోటీసులు పంపింది. కాగా, 2002లో ముంబైలో సల్మాన్ కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు మరణించారు. నలుగురికి గాయాలయ్యాయి.

సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణలో కింది కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినప్పటికీ హైకోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దీంతో 2002లో హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యారు.
కాగా, సల్మాన్ ఖాన్‌ను దోషిగా అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సల్మాన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ సీటులో సల్మాన్ ఖాన్ కూర్చుని ఉన్నారని పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications