హిజ్బుల్ ముజాహిదీన్ కుమారుడు.. మరో ముగ్గురికి జాబ్ లాస్.. కారణమిదే..?
జమ్ము కశ్మీర్ ప్రభుత్వం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝులిపించింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉగ్రవాద ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ తనయుడు సయ్యద్ అబ్దుల్ ముయీద్, జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్ ఉన్నారు.
ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఆర్టికల్ 311 కల్పించిన విశిష్ట అధికారంతో వారిపై ఎలాంటి విచారణ లేకుండానే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్.. డి కేటగిరీ సైంటిస్ట్-కశ్మీర్ యూనివర్సిటీ, మజీద్ హుస్సేన్ ఖాద్రీ.. సీనియర్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్-కశ్మీర్ యూనివర్సిటీ, సయ్యద్ అబ్దుల్ ముయీద్ ఐటీ మేనేజర్-జేకేఈడీఐ, అస్సబా ఉల్ అర్జామండ్ ఖాన్.. పబ్లిసిటీ విభాగం-డైరెక్టరేట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్, ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉద్యోగాలు కోల్పోయారు.

ఈ ఉద్యోగులు కార్యకలాపాలు రాష్ట్ర భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని నిఘా సంస్థలు, లా ఎన్ ఫోర్స్ మెంట్ అందించిన సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించిన సంగతి తెలిసిందే. స్థానికంగా నిరసనలు వచ్చినా.. ప్రత్యేక బలగాలను మొహరించి మరీ చర్యలు తీసుకున్నారు. తాజాగా ఆ ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. రాజ్యాంగ సవరణతోనే ఇదీ సాధ్యమయ్యింది. అంతకుముందు ఈ వెసులబాటు లేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications