అలా చేస్తే నా కొడుకుల తల నరికేస్తా: షారుక్ ఖాన్ ఆవేశం
అమ్మాయిలను వేధిస్తే తన కుమారులను అయినా క్షమించనని, వారి తల నరికేస్తానని షారుక్ ఖాన్ అన్నారు. ఈ రోజు (బుధవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
ముంబై: అమ్మాయిలను వేధిస్తే తన కుమారులను అయినా క్షమించనని, వారి తల నరికేస్తానని షారుక్ ఖాన్ అన్నారు. ఈ రోజు (బుధవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
అమ్మాయిలను వేధించే హక్కు ఎవరికీ లేదన్నారు. తన కుమారులు ఎప్పుడైనా మహిళలను కించపరిస్తే తల నరికేస్తానని ఆవేశంగా చెప్పారు. ఆ మధ్య బెంగళూరులో ఓ అమ్మాయి పైన దాడి ఘటనపై చలించిన షారుక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహిళలను గౌరవించాలని, వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఇదే విషయం తన కుమారులకు చెబుతానని అన్నారు. మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోందని, ఈ విషయంలో మార్పు రావాలన్నారు.
అమ్మాయిగా పూడితే బాగుండునని అప్పుడప్పుడు అనిపిస్తోందన్నారు. ఓ మహిళకు ఉండాల్సిన శక్తి, ధైర్యం, త్యాగం చేసే తత్వం, అందం తనకు లేవన్నారు. మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications