Live:అస్సాంలో మిన్నంటిన నిరసనలు: గౌహతి కమిషనర్ దీపక్ కుమార్ తొలగింపు

ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో వివక్షకు గురైన ముస్లిమేతర వ్యక్తులు, కాందీశీకులకు పౌరసత్వం కల్పించే బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ఆమోదం పొందడానికి ముందు ఈశాన్య, ఇతర రాష్ట్రాల్లో ఈ బిల్లుపై వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లుపై చర్చ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

Home minister Amit Shah to introduce Citizenship Amendment Bill in Rajya Sabha live

Dec 12, 2019, 5:30 pm IST

అస్సోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కాన్వాయ్ పై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
Dec 12, 2019, 4:20 pm IST

ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత పర్యటనను వాయిదా వేసుకున్న బంగ్లాదేశ్ మంత్రి అబ్దుల్ మోమెన్
Dec 12, 2019, 4:16 pm IST

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 19న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన లెఫ్ట్ పార్టీలు
Dec 12, 2019, 4:02 pm IST

అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుపై ఆగ్రహజ్వాలలు

అస్సాంలోని చాబువా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే వినోద్ హజారికా ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Dec 12, 2019, 3:07 pm IST

పౌరసత్వ సవరణ బిల్లు పై నిరసనలు: గౌహతి పోలీస్ కమిషనర్‌ దీపక్ కుమార్‌పై వేటు..కొత్త కమిషనర్‌గా మున్నా ప్రసాద్ గుప్తా నియామకం
Dec 12, 2019, 2:52 pm IST

పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల ఈశాన్యరాష్ట్ర ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి, భాషలకు ఎలాంటి భంగం వాటిల్లదు.అనవసరంగా ఆందోళన చెందరాదు: ప్రధాని మోడీ
Dec 12, 2019, 2:50 pm IST

పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల ఈశాన్య రాష్ట్ర పజలకు ఎలాంటి ఇబ్బందులు రావన్న ప్రధాని మోడీ
Dec 12, 2019, 2:50 pm IST

ఈశాన్య రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాలి.. తప్పు దోవ పట్టరాదు: ప్రధాని మోడీ
Dec 12, 2019, 1:14 pm IST

ఈశాన్య రాష్ట్రాల్లో ఇంటర్నెట్ లేకుంటే ప్రధాని ట్విటర్‌లో పోస్టు చేసిన మాటలను ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఎలా చదువుతారు: కాంగ్రెస్ సెటైర్
Dec 12, 2019, 1:12 pm IST

పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యాక ఈశాన్యంలో హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోంది: ప్రభుత్వం
Dec 12, 2019, 1:11 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి..అయితే ఈశాన్య రాష్ట్రాలు మాత్రం అట్టుడికిపోతున్నాయి:గులాంనబీ ఆజాద్
Dec 12, 2019, 10:56 am IST

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంస్థ తరపున సుప్రీంకోర్టులో వాదించనున్న కపిల్ సిబాల్
Dec 12, 2019, 10:42 am IST

పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
Dec 12, 2019, 10:18 am IST

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాంలో నిరసనలు.హింసాత్మకంగా మారిన నిరసనలు, పలు రైళ్లు విమానాలు రద్దు
Dec 12, 2019, 10:07 am IST

బిల్లులో ముస్లింలకు చోటేదీ అని ప్రశ్నించిన విదేశీ మీడియా
Dec 12, 2019, 9:37 am IST

పౌరసత్వ సవరణ బిల్లును తప్పుబట్టిన విదేశీ మీడియా..మత ప్రాతిపదికన వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిందంటూ కథనాలు
Dec 12, 2019, 8:18 am IST

బంగ్లాదేశ్ కూడా మత సామరస్యంతో మెలుగుతుంది. మిగతా దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా జీవన విధానం ఉంది. కావాలంటే అమిత్ షా ఇక్కడ కొద్దిరోజులు ఉండొచ్చన్న బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మోమెన్
Dec 12, 2019, 7:37 am IST

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలుపడంతో శరణార్థులు మంజూ కా తిలా ప్రాంతంలోప్రధాని మోడీ చిత్రపటంతో ఆనందోత్సవం
Dec 11, 2019, 9:46 pm IST

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కోట్లాదిమంది బాధితుల స్వప్నం సాకారమైందని వ్యాఖ్య.
Dec 11, 2019, 9:44 pm IST

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లను రాజ్యసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో సోదరభావాన్ని పెంపొందించే బిల్లుగా అభివర్ణన.
Dec 11, 2019, 9:15 pm IST

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదం పొందడం పట్ల నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. బ్లాక్ డే గా అభివర్ణించిన సోనియా.
Dec 11, 2019, 9:07 pm IST

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, వాదోపవాదాలు, చర్చోపర్చల మధ్య బిల్లుకు ఆమోదం. ఆరు గంటల పాటు కొనసాగిన చర్చ.
Dec 11, 2019, 9:05 pm IST

వాయిదా పడ్డ రాజ్యసభ

పౌరసత్వ సవరణ బిల్లుపై ముగిసిన ఓటింగ్. పెద్దల సభ ఆమోదం పొందిన బిల్లు. ఆ వెంటనే వాయిదా పడ్డ రాజ్యసభ.
Dec 11, 2019, 9:03 pm IST

రాజ్యసభలో పౌరసత్వ బిల్లుకు ఆమోదం

రాజ్యసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు. అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు. ప్రతికూలంగా 105 ఓట్లు.
Dec 11, 2019, 9:01 pm IST

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ
Dec 11, 2019, 8:30 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ

భారత్ ఏనాటికీ ముస్లిం రహిత దేశంగా మారబోదు: రాజ్యసభలో అమిత్ షా
Dec 11, 2019, 8:24 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్

పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్ కు శివసేన గైర్హాజర్. ఓటింగ్ సమయంలో కనిపించని శివసేన సభ్యులు.
Dec 11, 2019, 8:17 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్

పౌరసత్వ సవరణ బిల్లును ఎంపిక కమిటీ లేదా ఎంపిక ప్యానెల్ కు పంపించాలనే తీర్మానం ఆమోదం పొందాలంటే ప్రతికూలంగా 105 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది.
Dec 11, 2019, 8:15 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్

పౌరసత్వ సవరణ బిల్లును ఎంపిక కమిటీ లేదా ఎంపిక ప్యానెల్ కు పంపించాలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సీపీఎం సభ్యుడు కేకే రాగేష్.
Dec 11, 2019, 8:13 pm IST

పౌరసత్వ సవరణ బిల్లుపై ఓటింగ్

పౌరసత్వ సవరణ బిల్లును ఎంపిక కమిటీ లేదా ఎంపిక ప్యానెల్ కు పంపించాలనే తీర్మానానికి ప్రతికూలంగా 124 మంది, అనుకూలంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+