పక్కా ప్లాన్‌తో హనీప్రీత్‌లా నటింపచేసి.., పరారిలో 17 సిమ్‌లు ఉపయోగించిన దత్తపుత్రిక
డేరా బాబాతో సంబంధం, ఆయన అరెస్ట్ అనంతరం అల్లర్ల పాత్రపై విచారించేందుకు హనీప్రీత్‌ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
చండీగఢ్: డేరా బాబాతో సంబంధం, ఆయన అరెస్ట్ అనంతరం అల్లర్ల పాత్రపై విచారించేందుకు హనీప్రీత్‌ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
చదవండి: 'హనీప్రీత్ ఓ మంచి కోడలు కానీ, రాసలీల తర్వాతే ఇలా'
పోలీసుల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పడం లేదు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించడం లేదని చెబుతున్నారు. పోలీసులను ఆమె మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.

మాట మార్చుతుండటంతో అనుగుణంగా ప్రశ్నలు
ఆమె నుంచి అన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి విచారణ కోసం తీసుకెళ్లారని ప్రచారం సాగుతోంది. ఆమెను ప్రశ్నించేందుకు 300 ప్రశ్నలు సిద్ధం చేశారు. ఆమె పదేపదే తన స్టేట్‌మెంట్లను మార్చుతుండటంతో వారు అందుకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా మరో ప్రాంతానికి
ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లేందుకు పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఆమెను తీసుకు వెళ్లేందుకు డమ్మీ పోలీసులను వారిలా బయటకు పంపించి, ఆ తర్వాత వీరిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని అంటున్నారు.

అల్లర్ల కోసం రూ.1.25 కోట్లు
కాగా, డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో చోటుచేసుకున్న అల్లర్లకు ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ కారణమని పోలీసులు తేల్చారు. అల్లర్ల కోసం హనీప్రీత్ రూ.1.25కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మాస్టర్ మైండ్ హనీప్రీత్
ఆగస్టు 25న హర్యానాలోని పంచుకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. విచారణ నేపథ్యంలో అప్పటికే పంచుకులకు భారీగా చేరుకున్న గుర్మీత్ అనుచరులు, భక్తులు తీర్పు వెలువడిన అనంతరం పెద్దఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటనల్లో 30 మందికిపైగా మృతి చెందారు. అయితే ఈ అల్లర్లకు మాస్టర్ మైండ్ హనీప్రీతేనని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ విచారణలో వెల్లడి
కస్టడీలో ఉన్న గుర్మీత్ వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్ రాకేశ్ కుమార్‌ను విచారించగా ఈ విషయాలను వెల్లడించినట్లు చెప్పారు. కోర్టు తీర్పుకు రెండు రోజుల ముందు పంచకుల డేరా బ్రాంచ్ హెడ్‌కు హనీప్రీత్ రూ.1.25కోట్లు ఇచ్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

17 సిమ్‌లు ఉపయోగించిన హనీప్రీత్
డేరా బాబా అరెస్టు అనంతరం 38 రోజులు అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ అన్ని రోజుల్లో 17 సిమ్‌లు ఉపయోగించిందని తేలింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications