కుమార్తె లవ్ మ్యాటర్ లీక్.. ప్రియుడిని ఇంటికి పిలిపించి చేయకూడని పని !
లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయి ఫ్యామిలీ చంపేస్తుంది
అరేంజ్డ్ మ్యారేజ్ అయితే భార్య చంపేస్తుంది
పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్లు చంపేస్తారు..
ఇది సగటు అబ్బాయి బాధ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవ్వడం చూసే ఉంటాం. ఇప్పుడు ఈ తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ కుటుంబం దారుణానికి పాల్పడి యువకుడి ప్రాణాలు తీశారు. పెళ్లి కోసం పిలిచి ఇంటికి రమ్మని చెప్పి.. లోపలికి వెళ్లగానే క్రూరంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణేలో జరగగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రేమకథ విషాదం..
పింప్రి చించ్వాడ్ లోని సాంఘ్వి ఏరియాకు చెందిన ఓ యువతి స్థానిక యువకుడు రమేశ్ ఘెంగాత్ ను ప్రేమించింది. ఇద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుండగా విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్‌పై ఇప్పటికే రేప్ కేసు, పోక్సో కేసులు నమోదై ఉన్నాయని, అలాంటి వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోమని కూతురికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఆమె ససేమిరా అనడంతో చివరికి పెళ్లికి ఒప్పుకున్నట్టు సమాచారం.

పెళ్లి పేరిట ఉచ్చు..
ఈ నేపథ్యంలో పెళ్లి విషయంపై చర్చించేందుకు యువతి కుటుంబ సభ్యులు రమేశ్‌ను ఆయన తల్లిదండ్రులతో పాటు ఇంటికి పిలిచారు. కానీ ఇరు వర్గాల మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరడంతో.. రమేశ్‌ను ప్రేమ పేరుతో తమ కూతురిని వలలో వేసుకున్నాడని తీవ్రంగా దూషించారు. మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. అమ్మాయి కుటుంబ సభ్యులు రమేశ్‌ను గదిలోకి లాక్కెళ్లి కర్రలతో, బెల్టులతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ రమేష్ మరణించాడు.
ఈ క్రమంలోనే రమేష్ మృతితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా ఘటనలు మంచివి కాదని హితబోధ చేస్తున్నారు.
మరోవైపు రమేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కుటుంబ సభ్యుల్లో 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.












Click it and Unblock the Notifications