చైనా మద్దతుతో మళ్లీ ఆర్టికల్ 370 - జమ్మూకాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మరో సంచలనం
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే భారత్ లో ఉండేకంటే, చైనీయులుగా జీవించాలని కాశ్మీరీలు కోరుకుంటున్నారంటూ గతంలో బాంబు పేల్చిన ఆయన... తాజాగా చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏడు నెలల పాటు గృహనిర్భందం తరువాత గత నెలలో విడుదలైన ఫరూక్ అబ్దుల్లా పలు జాతీయ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును కశ్మీరీలుగానీ, చైనాగానీ ఏనాడూ ఆమోదించలేదని, గత ఒప్పందాలకు విరుద్ధంగా కేంద్రం ఆర్టికల్ 370ని తొలగించింది కాబట్టే, దానికి వ్యతిరేకంగా సరిహద్దులో చైనా చర్యలకు దిగుతోందని చెప్పారు. అంతటితో ఆగకుండా.

చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందన్న నమ్మకం ఉందని కూడా అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నిజానికి భారత్ వ్యవహారంలోకి చైనాను ఆహ్వానించింది ప్రధాని మోదీనే అని, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఇండియాకు పిలిచి, ఊయల ఊగింది, కలిసి భోజనం చేసింది మోదీనే అని అబ్దుల్లా గుర్తుచేశారు.
''జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం అన్యాయంగా వ్యవహరించింది. దానిపై పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం కాశ్మీరీలు తమను తాము భారతీయులుగాకంటే, చైనీయులుగా ఉండటానికే ఇష్టపడుతున్నారని అనిపిస్తోంది. చైనా మద్దతుతో మళ్లీ ఆర్టికల్ 370 ఉనికిలోకి వస్తుందన్న నమ్మకం ఉంది'' అని అబ్దుల్లా పేర్కొన్నారు.
-
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications