కేజ్రీవాల్ పనైపోయింది: అన్నాహజారే, సందీప్ వేరే అమ్మాయిలనూ..

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందని అన్నా హజారే వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అద్భుతాలు సృష్టిస్తాడ‌ని భావించానని, కానీ అంతా అయిపోయిందన్నారు.

కేజ్రీవాల్ ప్ర‌భుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు జైళ్ల‌కు వెళ్తుండ‌టం, అవినీతికి పాల్ప‌డుతుండ‌టంపై తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్లు అన్నా హ‌జారే వెల్ల‌డించారు. 'నా మ‌న‌సు తీవ్రంగా గాయ‌ప‌డింది. కేజ్రీవాల్ నాతో ఉన్న‌పుడు గ్రామస్వ‌రాజ్‌పై ఓ పుస్త‌కం రాశారు. మ‌రిప్పుడు ఆయ‌న పాల‌న‌ను గ్రామ‌స్వరాజ్ అంటారా? ఇదే నాకు చాలా బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం పోయింద'ని అన్నా హ‌జారే అన్నారు.

మ‌హిళ‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల‌పై ఆప్ ఎమ్మెల్యే సందీప్ కుమార్ అరెస్ట్ అవ‌డంపై హ‌జారే పై వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎలాంటి వ్య‌క్తులు వ‌స్తున్నారో చూసుకోవాల‌ని తాను ముందే కేజ్రీవాల్‌ను హెచ్చరించానని చెప్పారు.

'Hope With Which I Was Looking At Arvind Kejriwal Is Over': Anna Hazare

నీవు పార్టీ పెట్టాక దేశమంతా తిరుగుతావని, ర్యాలీలు నిర్వ‌హిస్తావని, కానీ నీ పార్టీలోకి వ‌చ్చే వ్య‌క్తులు మంచి గుణం క‌లిగి ఉన్న‌వారా లేదా అన్న‌ విష‌యం ఎలా గుర్తిస్తావని తాను ముందే ప్రశ్నించానని చెప్పారు. దానికి కేజ్రీవాల్ స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌న్నారు.

అదే ఇప్పుడు జరుగుతోందన్నారు. కేజ్రీవాల్ త‌న‌తో చాలా ఏళ్లు క‌లిసి ఉన్నార‌ని, ఆయ‌న‌పై త‌న‌కెంతో న‌మ్మ‌కం ఉండేద‌ని, దేశ రాజ‌కీయాల్లో కేజ్రీవాల్ ఏదో కొత్త‌గా చేసి దేశాన్ని ఓ కొత్త దిశ‌లో న‌డిపిస్తార‌ని ఆశపడేవాడినని చెప్పారు. అయితే ప్ర‌స్తుత ప‌రిణామాల‌తో ఆ న‌మ్మ‌కం పోయింద‌న్నారు.

సందీప్‌ ఇతరులనూ వేధించాడు: పోలీసులు

అశ్లీల వీడియోలు బయటకు రావడంతో అరెస్టైన ఢిల్లీ మాజీ మంత్రి సందీప్‌ కుమార్‌ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సందీప్‌ గతంలో కూడా కొందరు మహిళలను లైంగికంగా వేధించినట్లు విచారణలో బయటపెట్టడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు.

సందీప్‌పై అత్యాచారం కేసు నమోదవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా గతంలో చాలామంది మహిళలను లైంగికంగా వేధించడమేగాక, వాటిని వీడియో రికార్డు చేశానని విచారణ సమయంలో సందీప్‌ చెప్పినట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనల్లో సందీప్‌కు సాయపడిన అతడి సన్నిహితుడు ప్రవీణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిజానిజాలను బయటకు తీసుకొచ్చేందుకు సందీప్‌కు మరో నాలుగు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సందీప్‌కు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో కేజ్రీవాల్‌ ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+